– రాహుల్ గాంధీ కులం ఏంటి?
– రాహుల్ గాంధీ తాత ఒక పర్షియన్
– రాహుల్ బ్రాహ్మిణ్ అని చెప్పుకుంటున్నారు
– రాహుల్ గాంధీ కి గాయత్రి మంత్రం వచ్చా?
– పొన్నం ప్రభాకర్ లేదా మహేష్ కుమార్ గౌడ్ ను సీఎంని చేయండి
– రేవంత్ మంచి యాక్టర్.. నోబెల్ ప్రైజ్ కాదు.. గ్లోబల్ ఇవ్వాలి
– పోస్ట్ వచ్చిన వారంతా లీడర్లు కాదు
– మా పార్టీ తరపున 42 శాతం బీసీలకు సీట్లు ఇస్తాం
– మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు చిట్ చాట్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ను వైస్ ప్రెసిడెంట్ చేయాలంటున్నారు కదా.. మేము అడుగుతున్నాము.. పొన్నం ప్రభాకర్ ను లేదా నా ఫ్రెండ్ మహేష్ కుమార్ గౌడ్ ను ముఖ్యమంత్రిని చేయండి. కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు పార్టీలు షాడో బాక్సింగ్ చేస్తున్నాయి. సీఎం కు ఆస్కార్ కాదు అత్తారింటికి దారేది మూవీలో ఉన్న భాస్కర్ అవార్డు ఇవ్వాలి. రేవంత్ మంచి యాక్టర్. నోబెల్ ప్రైజ్ కాదు. గ్లోబల్ ఇవ్వాలి.
మోడీ కులాన్ని బీసీ లో కలిపాకే ఆయన సీఎం అయ్యారు. మోడీ నీ కన్వర్షన్ బీసీ అనడం అన్ని వెనకబడిన కులాలను అవమానపరచడమే. రాహుల్ గాంధీ కులం ఏంటి? రాహుల్ గాంధీ తాత ఒక పర్షియన్. రాహుల్ బ్రాహ్మిణ్ అని చెప్పుకుంటున్నారు. రాహుల్ గాంధీ కి గాయత్రి మంత్రం వచ్చా? రాహుల్ గాంధీ బ్రాహ్మణ వర్గం ఎలా అవుతారు? నేను కూడా బిసినే. బ్రాహ్మిన్ కమ్యూనిటీ.
పార్టీ పోస్టుల కొరకు నా దగ్గరికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్న. ప్రజల వద్దకు వెళ్ళండి సమస్యలపై పోరాటం చేయండి. అప్పుడే లీడర్ అవుతారు తప్ప, పోస్ట్ వచ్చిన వారంతా లీడర్లు కాదు.ఐదేళ్లుగా నేను నాకు ఏ పోస్ట్ లేదు. నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తాం.
ఫోన్ ట్యాపింగ్ పవ్యవహారం లో ఏ లీడర్ అయిన అరెస్ట్ అయ్యాడా? భట్టి నాపై చేసిన వ్యాఖ్యలపై కోర్టు కి వెళ్తాను. నేను భట్టి ని భయపెట్టేందుకు నోటీసులు ఇవ్వలేదు కదా? పాపం ఆయన నా నోటీసులు పూర్తిగా చదవలేదు అనుకుంటా. జూబ్లిహిల్స్ ను బీజేపీ సీరియస్ గా తీసుకుంటుంది. జూబ్లిహిల్స్ టికెట్ ను చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు. జూబ్లిహిల్స్ ప్రజలు బీజేపీ ని కోరుకుంటున్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో మంచి ఫలితం రాబోతుంది.
హైడ్రా తో ఇల్లు కూల్చిన మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూలనుంది. హైడ్రా కు పేదవాడి ఇల్లు కూల్చినప్పుడు కనిపించని మానవత్వం, ఫాతిమా కాలేజీ దగ్గర గుర్తు వచ్చిందా? హైడ్రా ఒక ఫెయిల్యూర్ వ్యవస్థ. మేము అధికారంలోకి వచ్చాక హైడ్రా ఉంచాలా ? లేదా ? అనేది ఆలోచిస్తాం. ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుంటే మేము మా పార్టీ తరపున 42 శాతం బీసీలకు సీట్లు ఇస్తాం. బీసీలకు మా మొదటి ప్రాధాన్యత. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తాం.
రాజాసింగ్ విషయం అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం పరిధిలో ఉన్న అంశంపై నేను మాట్లాడటం సరికాదు. కాంగ్రెస్ , బి ఆర్ ఎస్ ను చూశారు. బీజేపీ కి ఒక్క అవకాశం ఇవ్వండనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తాం. ఎంపీ ల మీటింగ్ రహస్యం గా జరగలేదు. మా ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కొత్త ఇల్లు గృహ ప్రవేశం చేశారు. అందుకే మిగతా ఎంపీలకు లంచ్ ఇచ్చారు తప్ప, అంతకు మించి మీ లేదు. కాంగ్రెస్ కు బి ఆర్ ఎస్ కు ప్రేమ బంధం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కాలేదని చెబుతున్నారు. నోటుకు ఓటు కేసు ఎక్కడికి పోయిందో తెలియదు. ఇప్పుడేమో కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, మిగతా అవినీతి కేసులు ఎక్కడికి పోయాయో తెలియదు.