నేరస్తులకు అడ్డాగా మారిన ఆర్ అండ్ బి అతిథి గృహం!
– మంత్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే కన్నా విమర్శ
సత్తెనపల్లి: పట్టణంలో 75 లక్షలతో ఆధునికీకరణ చేసిన ఉప ఖజానా కార్యాలయం, మూడు కోట్ల 45 లక్షలతో ఆర్ అండ్ బి అతిథి గృహాన్ని రోడ్లు భవనాలు, పెట్టుబడుల మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి, శాసన సభ్యుడు కన్నా లక్ష్మీ నారాయణ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గతంలో నేరస్తుల అడ్డాగా సత్తెనపల్లి ఆర్ అండ్ బి అతిథిగృహం మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రాన్ని గుంతలు లేని రాష్ట్రం గా మారుస్తామని అన్నారు. ఇంకా వారు ఏమన్నారంటే.. జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం. రాష్ట్రంలో 2వేల కోట్లతో రోడ్ల మరమ్మతులు కు శ్రీకారం.
కొండమోడు అండ్ పేరేచర్ల జాతీయ రహదారి పనులు ప్రారంభం. రాష్ట్రాన్ని నాశనం చేసి, అప్పల పాలు చేశారు జగన్ రెడ్డి. వైసీపీ పాలనలో కల్తీ మద్యం ఏరులైపారింది. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నాం. వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనం అయింది. రౌడీలను, గంజాయి బ్యాచ్ లను పలకరింపునకు రోడ్డు మీదకు వచ్చిన జగన్ రెడ్డి… గ్రామాల్లోని కులాలను రెచ్చకొడుతున్నారు. వైసీపీ నాయకులు రప్పా రప్పా అంటూ కవ్వింపు చర్యలు పాల్పడుతున్నారు. వైసీపీ పార్టీ ని ప్రజలు తిరస్కరించారు. రాష్ట్రం అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోనే సాధ్యం. వైసీపీ హయాంలో పోలవరం పక్కన పెట్టారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.