– దేవాలయ భూములు అమ్మేందుకు కాంగ్రెస్ కుట్ర
– కాంగ్రెస్‌వి సంతుష్టీకర రాజకీయాలు
– దేవదాయ భూములను మదర్సాలకు ఎలా ఇస్తారు?
– కిషన్‌రెడ్డి చొరవతోనే భద్రాచలం అభివృద్ధికి కేంద్రం నిధులు
– భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ దర్శనం అనంతరం మీడియాతో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
భద్రాచలం: గతంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఈ ప్రాంత అభివృద్ధికి రూ.98 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో రూ.42 కోట్ల నుండి రూ.48 కోట్ల వరకు ఇప్పటికే విడుదలయ్యాయి. మిగిలిన నిధులు డీపీఆర్ వచ్చిన తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ ప్రదేశాన్ని రామాయణ సర్క్యూట్లో చేర్చాలని అప్పట్లోనే నిర్ణయించారు. ఈ మహిమాన్వితమైన భద్రాచలాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోంది. నేను నా వ్యక్తిగతంగా, అలాగే పార్టీ తరఫున ప్రయత్నం చేస్తాను. ప్రస్తుత సాంస్కృతిక శాఖ మంత్రిని కూడా దీనిపై అడుగుతాను. ఇది దేశమంతా గౌరవించే స్థలమైన భద్రాద్రి రామాలయంగా ప్రసిద్ధి చెందింది.
త్వాలు గానీ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గానీ భద్రాద్రి రాముడిపై గౌరవంగా వ్యవహరించలేదు. రామనవమి వంటి పర్వదినాల్లోనూ ఆలయం పట్ల తగిన శ్రద్ధ చూపలేదు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపైనా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇలాంటి ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించలేదు, అప్రిషియేట్ చేయలేదు. కానీ వారు కూడా అభివృద్ధికి తగిన సహకారం అందించాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై, హిందూ సంస్థలపై దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ముత్యాలమ్మ గుడి, పెద్దమ్మ గుడిలో జరిగిన ఘటనలు మనమందరం చూశాం.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యమయ్యాయి. అందుకే హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా స్పందించడంలేదు. ఇది మంచి పద్ధతి కాదు. మరోవైపు టీటీడీ భూములను మదర్సాలకు కేటాయించడం, ఆ భూముల్లో మార్కెట్ నిర్మాణాలు చేయడం జరిగాయి.
ఇలా దేవాలయ భూములను ఇతర మతస్తులకు అప్పగించడం జరుగుతోంది. ఇవన్నింటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధమైన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, దేవాలయ భూములను తిరిగి దేవాలయాలకే కేటాయించే చర్యలు తీసుకోవాలి.