– సీఎం రమేష్ లాంటి బ్రోకర్ల మాటలను తెలంగాణ సమాజం నమ్మదు
– తెలంగాణకు వ్యతేరేకంగా పని చేసిన వ్యక్తులకు రేవంత్ పోస్టింగ్ లు
– ఆదిత్యనాథ్ దాస్ ,ఆంజనేయరెడ్డి, శ్రీరామ్ కర్రీ వీళ్లంతా ఎవరు ?
– ముద్దాయి ఉదయసింహ ఏ హోదా లో రివ్యూల్లో పాల్గొంటున్నారు ?
– బూతులకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన రేవంత్
– తనను దెయ్యం అన్నందుకు రేవంత్ కు సోనియా అవార్డు ఇచ్చిందా ?
– ఎస్సీ వర్గీకరణ విషయం లో ఓ న్యాయం. బీసీ రిజర్వేషన్ల పై మరో న్యాయమా
– కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలరాజు యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభ ప్రద్ పటేల్
హైదరాబాద్: రేవంత్ రెడ్డి ఢిల్లీ లో సోనియా లెటర్ ను ఆస్కార్ అవార్డు , నోబెల్ ప్రైజ్ , లైఫ్ టైం అవార్డుగా పేర్కొన్నారు. తనను దెయ్యం అన్నందుకు రేవంత్ కు సోనియా అవార్డు ఇచ్చిందా ? బీసీ రిజర్వేషన్లు పెంచినందుకు సోనియా రేవంత్ రెడ్డి అవార్డు ఇచ్చిందా ?
తెలంగాణ అస్తిత్వం పై రేవంత్ దాడి కొనసాగుతోంది. బనకచర్లతో మన గోదావరి జలాలను రేవంత్ ఏపీ కి తరలిస్తున్నా కోదండరాం ,ఆకునూరి మురళి ,హరగోపాల్ మౌనం గా ఎందుకుంటున్నారు? రేవంత్ నీళ్లు ఏపీ కి, మూటలు ఢిల్లీ కి పంపుతున్నారు. నియామకాల్లో ఘోరమైన అన్యాయం జరుగుతోంది.
ఏపీ లో తెలంగాణ కు వ్యతేరేకంగా పని చేసిన వ్యక్తులకు రేవంత్ పోస్టింగ్ లు ఇస్తున్నారు. ఆదిత్యనాథ్ దాస్ ,ఆంజనేయరెడ్డి, శ్రీరామ్ కర్రీ వీళ్లంతా ఎవరు ? తెలంగాణ సొమ్మును వారికి దోచి పెడుతున్నావ్ రేవంత్ రెడ్డి ? ఇంకా చాలా విభాగాల్లో తెలంగాణ ద్రోహులను రేవంత్ రెడ్డి నియమించి రాష్టానికి ద్రోహం చేస్తున్నారు.
తెలంగాణ కు సీఎం రమేష్ కు ఏం సంబంధం ? తన దోస్త్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు రేవంత్ రెడ్డి కాంట్రాక్టు కట్టబెట్టారని కే టీ ఆర్ ఆరోపించారు. ఆ ఆరోపణల పై స్పందించకుండా సీఎం రమేష్ కులాల కుంపటిని రాజేస్తున్నారు. జూబిలీ హిల్స్ ఉప ఎన్నికను కోసం రేవంత్ రెడ్డి సీఎం రమేష్ తో మాట్లాడిస్తున్నారు. సీఎం రమేష్ లాంటి బ్రోకర్ల మాటలను తెలంగాణ సమాజం నమ్మదు గాక నమ్మదు
ఓటు కు నోటు స్కాం లో ఉన్న ముద్దాయి ఉదయసింహ ఏ హోదా లో రివ్యూల్లో పాల్గొంటున్నారు ? బీసీ కులాలన్న ,బీసీ నాయకులన్నా సీఎం రేవంత్ కు చిన్న చూపు. బీసీ కులాలపై రేవంత్ తో కాంగ్రెస్ అధిష్టానం మాట్లాడిస్తోందా ? బూతులకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన రేవంత్ చెప్పేదొకటి చేసేదొకటి. రేవంత్ రెడ్డి మాటలు చూసి ఊసరవెల్లులు సిగ్గు పడుతున్నాయి
సమస్యలు ఎన్నో ఉన్నా మంత్రులు హెలికాఫ్టర్ కోసం కొట్లాడుకుంటున్నారు. రేవంత్ సచివాలయం కు రావడం లేదు.మేధావులు మాట్లాడరా? రేవంత్ రెడ్డి సోనియా విషయం లో రేణుకా చౌదరి ని ఫాలో అవుతున్నారు. తెలంగాణ అస్తిత్వం పై రేవంత్ దాడిని మేధావులు ప్రశ్నించాలి.
కులగణన నుంచి బీసీ బిల్లు వరకు శాస్త్రీయంగా ప్రభుత్వం ముందుకు పోలేదు. ఢిల్లీలో ధర్నా చేస్తామని ఇపుడు వాయిదా వేసుకున్నారు.
ఇప్పటివరకు బీసీ రిజర్వేషన్ల పై ప్రధాని ని కలవలేదు. రేర్ మోడల్ అని రేవంత్ రెడ్డి తనకు తాను డబ్బా కొట్టుకుంటున్నారు. ఎస్సీ రిజర్వేషన్లకు 2011 సెన్సస్ తీసుకున్నారు ..మొన్నటి లెక్కలను ఎందుకు తీసుకోలేదు . కోర్టు కొట్టేస్తుందని భయమా ? ఎస్సీ వర్గీకరణ విషయం లో ఓ న్యాయం. బీసీ రిజర్వేషన్ల పై మరో న్యాయమా ? యూరియా కొరత పై సీఎం ఓ విధంగా, వ్యవసాయ మంత్రి ఇంకో విధంగా మాట్లాడుతున్నారు. వెంటనే యూరియా కొరతను తీర్చాలి. ప్రెస్ మీట్ లో రాజేష్ నాయక్ ,గౌతమ్ ప్రసాద్ పాల్గొన్నారు