• నాడు వివేకా హత్యను డైరవర్ట్ చేసినట్లే నేడు లిక్కర్ స్కాంను డైవర్ట్ చేసి మోసం చేయాలని చూస్తున్నారు
• తొలుత చెవిరెడ్డి స్నేహితుడు, మావాడే అని తీరా డబ్బులు దొరికాక అసలు తమ వాడు కాదని చెప్పే ప్రయత్నం
• తమ వాడే కాకుంటే చెవిరెడ్డి కోసం డమ్మిగా ఒంగోలులో ఎందుకు వెంకటేష్ నాయుడు నామినేషన్ వేశాడు?
• వెంకటేష్ నాయుడుతో చెవిరెడ్డికి ఎటువంటి సంబంధం లేకపోతే కొలంబోకు ఎందుకు తరలించాలని చూశారు?
• టెక్నికల్ ఎవిడెన్స్ తో వాస్తవాలు బయటకు రావడంతో వైసీపీ నేతల పప్పులు ఉడకక ఫోటోలతో డైవర్ట్ చేయాలని చూస్తున్నారు
• పాపం నుండి ఎవరూ తప్పించుకోలేరు.. త్వరలో ప్రధాన సూత్రధారి కూడా శిక్ష అనుభవిస్తాడు
– స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్
మంగళగిరి: లిక్కర్ స్కాం అంతా తాడేపల్లి డైరెక్షన్ లోనే జరిగిందని.. ఈ స్కాంలో విస్తుపోయే నిజయాలతో పాటు గుట్టలు గుట్టలు నగదు కట్టలు, వీడియోలు బయటకు రావడంతో వైసీపీ పత్రికలో, ఛానల్ లో అబద్దపు ప్రచారం చేస్తున్నారని.. వివేకా హత్యను డైవర్ట్ చేసినట్లే.. ఈ లిక్కర్ స్కాంలో వెంకటేష్ నాయుడిని తమ వాడు కాదని టీడీపీకి అంటగట్టలాని చూస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. టెక్నాలజీ ద్వారా వాస్తవాలు బయట పడ్డా వైసీపీ నేతలు బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగలవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివేకారెడ్డి హత్యను ఎలా డైవర్ట్ చేశారో.. నేడు లిక్కర్ స్కాంను కూడా డైవర్ట్ చేసి వైసీపీ నీలి మీడియాలో అబద్దాలు ఎలా వడ్డి వారిస్తున్నారో వీడియో ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
టెక్నాలజీతో లిక్కర్ స్కాం వాస్తవాలు బట్టబయలు
లిక్కర్ స్కాంలో విస్తుపోయే వాస్తవాలు బయట పడుతున్నాయి. డెన్ లలో గుట్టలుగుట్టలుగా నోట్ల కట్టలు బయట పడుతున్నాయి, నోట్ల కట్టలను లెక్కిస్తున్న దృశ్యాలు ప్రజల ముందుకు వచ్చాయి. జగన్ రెడ్డికి సన్నిహితులు చెవిరెడ్డి భాష్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లాంటి తాడేపల్లి ప్యాలస్ తో సబంధం ఉన్న అనేకమంది ఆధారాలు బయటపడుతున్నాయి. వెంకటేష్ నాయుడు ఎవరు అంటే చెవిరెడ్డి భాస్కర్ కు అత్యంత సన్నిహితుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆత్మలాంటి వాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన అనే ఆర్థికపరమైన అంశాలు చూసే వ్యక్తి ఈ విషం అనేక రకాలుగా తెలుస్తోంది. వెంకటేష్ నాయుడు తమకు సంబంధంలేదని.. అతను టీడీపీకి చెందిన వాడని ఫోటోలు బయట పెడుతున్నారు.
సాధారణంగా టీడీపీ పార్టీ ఆఫీసులో, ఇంటి దగ్గర ప్రజాదర్భార్ లు పెడుతున్నారు. కొన్ని వందల మంది వచ్చి చంద్రబాబు, లోకేష్ ల గారితో ఫోటోలు దిగుతారు.. ఒక ఫోటోదిగినంత మాత్రాన వాళ్ల మనిషి అని చెప్పడానికి ఆస్కారం ఉండదు. జగన్ కు, చెవిరెడ్డికి వెంకటేష్ నాయుడు అత్యంత సన్నిహితుడు అని చెప్పడానికి మా వద్ద టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. వ్యక్తులు ఏరోజు, ఎక్కడ ఉన్నారో వాళ్ల మొబైల్ టేటాను బట్టి తెలుసుకోవచ్చు. ఆ టెక్నాలజీని ఉపయోగించి 06.06.2023 న వెంకటేష్ నాయుడు, విజయసాయిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, బోనేటి చాణిక్య లతో జర్నలిస్ట్ కాలనీలో ఉన్నాడని తెలుస్తుంది. వెంకటేష్ నాయుడు మీవాడు కానప్పుడు 06.06.2023 న మీ నేతలతో ఎందుకు మీటింగ్ పెట్టాడు. 18.06.2023 న మిథున్ రెడ్డిని అపోలో ఆసుపత్రి వద్ద కలిశాడు. మీ కు ఏమి సంబంధం లేకుండా ఎందుకు కలిశాడు. 27.06.2023న వెంకటేష్ నాయుడు సైమన్ లు బయోలాజికల్ ఈ లిమిటెడ్ వద్ద కలిశాడు. ఎప్పుడెప్పుడు ఎవరెవరిని కలిశారు అనేది ఇంత స్పష్టంగా టెక్నాలజీ ఆధారంగా కనిపిస్తున్నా… బుకాయిస్తున్నారు. 06.08.2023 పిల్లకూరు కృష్ణమోహన్ రెడ్డిని మెహదీపట్నంలో కలిశాడు. 09.08.2023 తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని జూబ్లి హిల్స్ పెద్దమ్మ గుడి వద్ద కలిశాడు.
13.08.2023 లో సజ్జల శ్రీధర్ రెడ్డిని మెహదీపట్నంలో కలిశాడు. ఇంతమంది వైసీపీ నేతలో కలిసినా.. అయినా తమ వాడు కాదని చెబుతున్నారు. ఒక్క వైసీపీ నాయకుడైనా చేతిలో ఛార్జ్ షీట్ కాపీ పెట్టుకొని మీడియా ముందుకు వచ్చారా? ఛార్జ్ షీట్ లో రాసింది నిజం కాదు అబద్దమని ప్రూవ్ చేశారా? ఛార్జ్ షీట్ పబ్లిక్ డొమైన్ లోకి వచ్చి రెండు వారాలు దాటింది.. లిక్కర్ స్కాంలో ప్రాధన నిందిలుగా ఉన్న పత్రి ఒక్కరిని వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి రకరకాల సందర్భాల్లో అనే ప్రాంతాల్లో కలిసిన అంశాన్ని సిట్ ఆధారలతో సహా ప్రూవ్ చేశాకా ఎందుకు బుకాయిస్తున్నారు. చేతిలో అవినీతి రోత పత్రిక ఉందని ఏది పడితే అది రాస్తున్నారు.
అదే కుట్ర.. అదే కుతంత్రం
వివేకానందరెడ్డి హత్య నుండి నేడు మద్యం స్కాం వరకు రోజుకొక రకంగా ఫ్లేట్ ఫిరాయిస్తున్నారు.. వారి అబద్దాలు. విషపు రాతలకు అడ్డు అదుపులేదు.. వివేకా హత్య జరిగాకా మొదట వాళ్ల రోత ఛానల్లో వివేక గారు తీవ్ర అనారోగ్యంతో గుండెపోటుతో మరణించారని చెప్పారు. అలాగే నేడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడైన వెంకటేశ్ నాయుడు అంటు ప్రచారం చేశారు.. పత్రికలో కూడా అలాగే రాశారు.. ఆధారాలు బయట పడటంతో మళ్లీ దాన్ని రకరకాలుగా డైవర్ట్ చేశారు. వివేక హత్య నాడు జగన్ ఆయన భార్య అక్కడికి వచ్చి అద్భుతమైన నటనకు తెరలేపారు.
ఈ నాడు వెంకటేష్ నాయుడు వ్యవహారంలో కూడా తమ వాడు కాదని వైసీపీ నీచ పత్రిక టీవీలు అలాగే డ్రామాకు తెరలేపాయి. వాళ్ల సొంత పత్రికలోనే జనం వద్ద ఇంకా రెండు వేల నోట్లు ఉన్నాయని.. వాటిని ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద మార్చుకోవచ్చు అని రాశారు. నాడు వివేకా హత్య కేసులో గుండె పోట్లు, అనుమానాలు అన్ని అయిపోయాక చంద్రబాబు మీద ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో ఎలా మోసం చేశారో అలానే నేడు వెంకటేష్ నాయుడు తమ వాడు కాదని మోసం చేయాలని చూస్తున్నారు. జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు చేయాలని నాడు పిటిషన్ వేశాడు.
ఇక్కడ చూస్తే ఇదే వెంకటేష్ నాయుడితో చెవిరెడ్డికి డమ్మి అభ్యర్థిగా నామినేషన్ వేయించాడు.. వీళ్లకు సంబంధం లేకుండా ఎందుకు నామినేషన్ వేస్తాడు?వివేకా హత్యలో చివరకు వివేకా కూతరు అల్లుడిపై ఆరోపణలు చేశారు. అలాగే ఇక్కడ తమ మనిషే కాదు, ఇదంతా చంద్రబాబు డబ్బే అతని కుట్రే అనేలా నటకాలకు తెరలేపారు. వివేకా హత్య కేసులో ప్రధాన నిందుతున్ని వెనకేసుకు వస్తూ… చిన్న పిల్లోడు అంటూ నాడు జగన్ మాట్లాడాడు. రెండో వైపు వెంకటేష్ నాయుడు రియలేస్టేట్ వ్యాపారి రియలేస్టేట్ వ్యాపారుల వద్ద డబ్బులు ఉండవా? అని మరోవైపు వైసీపీ నీచ మీడియాలో డైవర్ట్ ప్రచారం చేస్తున్నారు.
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి నాడు సబీఐ అధికారులు వెళ్లినప్పుడు ఆయన్ను రక్షించేందుకు కొంత మంది గూండాలను ఆసుపత్రిలో పెట్టి ఒక నిందితుడిని ఏవిధంగా రక్షించారో మనం చూశాం.. నేడు సేమ్ టు సేమ్ అలాగే.. చెవిరెడ్డి తనను తాను రక్షించుకోవడంతో పాటు వెంకటేష్ నాయుడిని ను కూడా కాపాడేందుకు కొలంబో తరలించాలని చూశారు? ఏ సంబంధం లేకుండా చెవిరెడ్డి వెంకటేష్ నాయుడిని కొలంబో ఎందుకు తీసుకెళ్లాలని చూస్తాడు? షర్మిలగారు, సునీత వివేకా హత్య వెనుక ఎవరు ఉన్నారనేది వారే చెప్పారు.. అలాగే చెవిరెడ్డి భుజాన చేయి వేసుకొని వెంకటేష్ నాయుడిని జగన్ కు అనేక సార్లు పరిచయం చేశాడు. ఇది అంతా చూస్తుంటే.. కుట్రలు కుతంత్రాలకు సాక్షి అడ్డాగా మారిందని నిరూపితమైంది.
సునీతకు అండగా ఉంటాం
సొంత అన్న చేతిలో తండ్రిని కోల్పోయిన న్యాయం కోసం పోరాడుతూ.. ఏళ్లు క్షోభిస్తున్న సునీతకు మేం అండగా నిలబడతాం. తప్పకుండా వివేకా హత్య కేసులో నిందితులకు శిక్ష పడుతుంది. న్యాయం గెలుస్తుందని ఆశాభావ వ్యక్తం చేస్తున్నానని పట్టాభి రామ్ అన్నారు.