– రూ.600 కోట్లు బకాయిలు
– మధ్యాహ్న భోజనం వండే మహిళలకునెలకు రూ.3,000 కూడా ఏడు నెలలుగా చెల్లించలేకపోతున్నారు
– బిజెపి ఎమ్మెల్సీ అంజిరెడ్డి
హైదరాబాద్: గతంలో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపిటీసీలు, జెడ్పిటీసీలు, కౌన్సిలర్లు తమ ఊరు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కాంట్రాక్టులు చేశారు. ప్రస్తుతం సుమారు రూ.600 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ రూ.600 కోట్లు తక్షణమే, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
అదేవిధంగా, రాష్ట్రంలో 54,000 మంది మధ్యాహ్న భోజనం వండే మహిళలకు నెలకు కేవలం రూ.3,000 మాత్రమే ఇస్తున్నారు. ఆ మొత్తం కూడా ఇప్పటివరకు చెల్లించలేదు. వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు .. మధ్యాహ్న భోజనం వండే మహిళలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3,000 స్థానంలో కాంగ్రెస్ నెలకు రూ.5,000 ఇస్తుందని హామీ ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇప్పటివరకు రూ.5,000 ఇవ్వడం కాదు కదా… నెలకు రూ.3,000 కూడా గత ఏడు నెలలుగా చెల్లించలేకపోతున్నారు. ఈ మొత్తాన్ని తక్షణం విడుదల చేయాలి.
అదే కాదు, ఎన్నికల ముందు వీరు – ‘ఈఎస్ఐ, పిఎఫ్ కూడా ఇస్తాం’ అని హామీ ఇచ్చారు. కానీ, ఈఎస్ఐ, పిఎఫ్ అమలుకావాలంటే కనీస వేతనం రూ.15,600 ఇవ్వాలి. మధ్యాహ్న భోజన పథకంలో ఖర్చు వాటా.. 60% కేంద్ర ప్రభుత్వానిది, 40% రాష్ట్ర ప్రభుత్వానిది. కాగా.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కనీసం మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేకపోతుంది.
మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త మెను ప్రకటించారు. అయితే, ఆ మెను అమలు చేసే వారికి కూడా డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. మెను సప్లై చేయకపోవడంతో చిన్నపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు. చిన్నపిల్లల ఎదుగుదల, చదువు, మధ్యాహ్న భోజనం ఎంతో ముఖ్యం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిలు భేషరతుగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.
గ్రామపంచాయతీల్లో కంప్యూటర్ ఆపరేటర్లు పని చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారికి నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం దారుణం. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు.. మున్సిపల్ అయినా, గ్రామపంచాయతీలు మున్సిపల్లో విలీనం అయినా, కార్పొరేషన్లలో ఉన్నా.. వీరికి కూడా వేతనాలు రావడం లేదు. గ్రామపంచాయతీ సెక్రటరీలు కూడా అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నారు. వీరికి కూడా జీతాలు ఇవ్వడం లేదు.
రాష్ట్రంలో సుమారు 18,000 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. వీరికి గతంలో క్వింటాల్‌కు రూ.140 ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఆ అమౌంట్ ఇవ్వలేదు. ప్రతి నెల రూ.23 కోట్లు అయ్యే ఈ చెల్లింపులు, ఐదు నెలలుగా రూ.115 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. రేషన్ డీలర్లకు హామీ ఇచ్చిన మొత్తాన్ని తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో గతంలో ధర్నా నిర్వహించడం జరిగింది. బిజెపి తెలంగాణ రాస్ట్ర మాజీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.8,158 కోట్లు బకాయిలు పెండింగ్ లోనే ఉంచింది. విద్యార్థుల విద్య, భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలు ఆడుతోంది.
ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో కాలేజీలు విద్యార్థులకు, “మీరు ఫీజు కట్టండి లేదా ప్రభుత్వంచి రీయింబర్స్మెంట్ తెచ్చుకోండి” అని చెబుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడకుండా, ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బకాయిలు చెల్లించకుండా, పెద్ద పెద్ద కాంట్రాక్టులకు మాత్రం ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. ఇది దారుణం.
గ్రామపంచాయతీలలో సర్పంచుల పెండింగ్ బకాయిలతో పాటు, ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రంలోని ప్రతి హాస్పిటల్‌కి బకాయిలు ఉన్నాయి. ఆ మొత్తాన్ని కూడా విడుదల చేయాలి.
ఆగస్టు వరకు రైతుల భూ సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇటీవలే ‘భూభారతి’ కార్యక్రమం పెట్టి, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. మరి రైతుల సమస్యలు తీరనేలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.