– మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి
* కోటి రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం
రామచంద్రపురం: ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి కూటమి పార్టీ సీనియర్ వాసంశెట్టి సత్యం అన్నారు.
బుధవారం రామచంద్రపురం లోని పలు వార్డులకు మంజూరైన సుమారు కోటి రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ శివాజీ ఇతర అధికారులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ అభివృద్ధి నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ అభివృద్ధి పనులు చేపట్టారు.
రామచంద్రపురం పట్టణంలోని6,7,10,11,12,15,16,17,18, మరియు 27 వార్డుల్లో అభివృద్ధి శంకుస్థాపనులకు భూమి పూజ చేశారు. ముఖ్యంగా 17వ వార్డులో రూ. 77 లక్షలతో సిసి రోడ్లు సిసి డ్రైన్లు, రూ.4 లక్షల 63 వేలుతో నిర్మాణం పూర్తి చేసిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. ఏడో వార్డులో 15 లక్షల అరవై వేలు, 12వ వార్డులో 16 లక్షల 30 వేలు, పదవ వార్డులో మూడు లక్షల 85 వేలు, 9వ వార్డులో రూ.లక్షా 30 వేలు,15వ వార్డులో ఎనిమిది లక్షల 50 వేలు, 16 వార్డులో రెండు అభివృద్ధి పనులకు గాను సుమారు తొమ్మిది లక్షలు, 17, 18 వార్డుల్లో సుమారు నాలుగు లక్షల పైగా నిధులు వెచ్చించారు. మొత్తం వెరసి సుమారు కోటి రూపాయల నిధులుతో భూమి పూజ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజల మౌలిక అవసరాలు తీర్చేందుకు తగిన నిధులు మంజూరు చేస్తుంది అన్నారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులతో పాటు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీనెరవేరుస్తున్నామన్నారు.
మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో ఏడాది కాలంలోనే రామచంద్రపురం నియోజవర్గాన్ని రూ.125 కోట్లతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. అధికారులు ప్రజల భాగస్వామ్యంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలని మంచిది మంత్రి సుభాష్ కృషి చేస్తున్నారని మున్సిపల్ అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, వైస్ చైర్మన్ శివాజీ, మున్సిపల్ కమిషనర్ రాజు, డిఈ శ్రీకాంత్, ఏఈ లు సునీల్, ప్రభాకర్ రావు,ఆయా వార్డు కౌన్సిలర్లు, కూటమి పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.