-తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక
తమ సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ కమ్మ రాజకీయ వేదిక రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక అధ్యక్షులు విద్యాసాగర్ గోపాలం, ఉపాధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడారు.
తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో తమ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున నివసిస్తున్నారని అన్నారు.
కొన్ని నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థితిలో తమ సామాజిక వర్గం ఉందని అన్నారు.
కమ్మ జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలలో తమ వారికి రాజకీయ అవకాశాలు కల్పించాలని రాష్ట్రంలోని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.
ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో సుమారు 50 వేలకు మందికి పైగా కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారని అన్నారు.
మాగంటి గోపీనాథ్ మరణంతో ప్రస్తుతం ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన అర్హత గల నాయకుడికి సీటు కేటాయించాలని కోరారు.
ఇదే విషయాన్ని ప్రతి పార్టీ అధినేతకు కలిసి విన్నవిస్తామని చెప్పారు.