హైదరాబాద్ : రక్షా బంధన్ సందర్భంగా మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసం సోదరులు, సోదరీ మణులతో కోలాహలంగా మారింది. శనివారం రక్షా బంధన్ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తన సోదరుమణులు రాణి, వాణి, లక్ష్మి లు రాఖీ లు కట్టి స్వీట్లు తినిపించారు. ఎమ్మెల్యే సోదరులు తలసాని మహేష్ యాదవ్, ధర్మేందర్ యాదవ్, స్కైలాబ్ యాదవ్ లకు కూడా రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ కు తన సోదరీమణులు శ్వేత, స్వాతి లు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు.