– తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
హైదరబాద్: ఓట్ల చోరీని అడ్డుకోవాలని పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, విపక్ష ఎంపీలను ఢిల్లీలో పోలీసులు అదుపులోనికి తీసుకోవడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యయుతంగా ఈసీ ఆఫీసుకు ర్యాలీ చేస్తున్న నేతలను అమానవీయంగా అడ్డుకోవటం దుర్మార్గమైన చర్య అని ముఖ్యమంత్రి మండిపడ్డారు.