– లోక్‌సభలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ
న్యూఢిల్లీ: మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్, రెగ్యులేషన్ యాక్ట్ సవరణలను ప్రతిపాదిస్తూ మంగళవారం సభ ముందుకు తీసుకొచ్చాం. 2014కు ముందు దేశంలో మైనింగ్ రంగం పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలుసు. ప్రతిరోజూ మీడియాలో మైనింగ్ రంగం గురించి పతాక శీర్షికల్లో వార్తలు వచ్చేవి అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి లోక్‌సభలో అన్నారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే.. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్, రెగ్యులేషన్ యాక్ట్ కు సవరణలకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రవేశపెట్టడంతోపాటుగా, బిల్లు గురించి వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. మోదీ ఈ రంగంలో సమూల సంస్కరణలకు ప్రోత్సహించారు. వారి మార్గదర్శనంలో ఈ ఎంఎండీఆర్ చట్టానికి 2015, 2021, 2023లో సవరణలు తీసుకొచ్చాం. మంగళవారం మరో ఆరు సవరణలు తీసుకొచ్చి సభ ముందు ప్రతిపాదనలు పెట్టాం.
మైనింగ్ రంగం ద్వారా ఉపాధి కల్పన పెరగాలి, ఆర్థిక పరిస్థితిని మరింతగా పెంపొందించేందుకు మోదీ ఆలోచనలతో ముందుకెళ్తున్నాం. 2014కు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ద్వారా మైన్స్ కేటాయింపులు ఎలా జరిగేవో అందరికీ తెలుసు. ఓ చిట్టీపై రాసిస్తే.. గనుల కేటాయింపులు జరిగేవి. కానీ 2014 తర్వాత సంస్కరణలు తీసుకొచ్చి సంపూర్ణ పారదర్శకతతో.. వేలం ద్వారా గనుల కేటాయింపు జరుగుతోంది.
మోదీ ఆదేశాలకు అనుగుణంగా.. తీసుకొచ్చిన ఈ మార్పులకు పార్లమెంటు ఏకగ్రీవ ఆమోదం కోసం కోరుతున్నాను. ఇవాళ దేశంలో క్రిటికల్ మినరల్స్ డిమాండ్ పెరిగింది. రానున్న రోజుల్లో క్రిటికల్ మినరల్ పాత్ర మరింత కీలకంగా మారనుంది. ఈ ఏడాది ప్రారంభంలో క్రిటికల్ మినరల్ మిషన్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో.. ఎంఎండీఆర్ చట్టంలో సవరణలు ప్రవేశపెట్టాం. దేశ పురోగతిలో మైనింగ్ రంగం పాత్ర కీలకం.రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో క్రిటికల్ మినరల్స్ పాత్ర కీలకం. ఇంతటి కీలకమైన క్రిటికల్ మినరల్స్ కోసం మనం మనం విదేశాలపై ఆధారపడుతున్నాం. దేశంలో క్రిటికల్ మినరల్ ఉత్పత్తి తక్కువగా ఉంది.
మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన కారణంగా.. మనం కూడా క్రిటికల్ మినరల్ సప్లయ్ చైన్ రంగంలో పురోగతి సాధిస్తున్నాం. సోలార్ ప్యానెల్స్ నుంచి విండ్ టర్బయిన్స్ వరకు, వ్యవసాయం నుంచి వైద్య పరికరాల వరకు, ఎలక్ట్రానిక్స్ నుంచి ఎలక్ట్రిసిటీ వరకు, సెల్ ఫోన్ నుంచి విమానాల వరకు, డిఫెన్స్ నుంచి స్పోర్ట్స్ వరకు ప్రతి రంగంలో క్రిటికల్ మినరల్ పాత్ర కీలకం.
మోదీ ఏ దేశానికి వెళ్లినా.. ఆ దేశాధినేతలతో క్రిటికల్ మినరల్స్ పై చర్చిస్తున్నారు. మే కేఏబీఐఎల్ పీఎస్‌యూ ద్వారా.. విదేశాల్లోని క్రిటికల్ మినరల్ ను భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ లిథియం కోసం.. జాంబియా, అర్జెంటినా వంటి వేర్వేరు దేశాలకు వెళ్తున్నాం. ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం.
మోదీ ప్రధాని అయిన తర్వాత.. మైనింగ్ ప్రాంతాల అభ్యున్నతికోసం డీఎంఎఫ్‌ను ప్రవేశపెట్టారు. డీఎంఎఫ్ ద్వారా ఉపాధి కల్పన, ప్రజాసంక్షేమం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాం. గతంలో మైనింగ్ లీజుల విషయంలో రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు, వారి బంధు మిత్రులు దారుణంగా దోపిడీకి పాల్పడే వారు. కానీ మోదీ గారి నేతృత్వంలో.. అవినీతికి ఆస్కారం లేకుండా.. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల తో కలిసి ప్రజాసంక్షేమానికి డీఎంఎఫ్ ద్వారా బాటలు వేస్తున్నాం. ఎన్ఎంఈటీ ద్వారా ఎక్స్‌ప్లొరేషన్ కు సంపూర్ణ మద్దతుగా నిలుస్తున్నాం.
ఇవాళ విపక్షాలు కూడా.. ఈ సవరణలకు మద్దతుగా నిలుస్తాయని అనుకున్నాను. కానీ ఎప్పటిలాగే ఈ పార్టీలు అభివృద్ధికి ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. కొందరు నాయకులకు.. ఈ దేశంలో మైనింగ్ రంగంపై నమ్మకం లేదు, దేశ సైన్యంపై నమ్మకం లేదు, దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం లేదు, అత్యున్నత న్యాయస్థానంపై నమ్మకం లేదు, పార్లమెంటుపై నమ్మకం లేదు, ఎన్నికల సంఘంపై నమ్మకం లేదు, దేశంలోని మీడియాపై నమ్మకం లేదు. అందుకే ఇలా దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అడ్డంకులను సృష్టిస్తున్నారు.
రాహుల్ గాంధీ, జార్జ్ సోరస్, శ్యామ్ పిట్రోడా కలిసి ఈ కుట్రలో భాగస్వాములు. ఎన్ని యాత్రలు చేసినా ప్రజల విశ్వాసం రాహుల్ గాంధీపై లేదు. ఇప్పుడు కాదు కదా! రాహుల్ ఎప్పటికీ ప్రధాని కారు. రాహుల్ గాంధీ చేసే ప్రతి కామెంట్ రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న సంస్థలపైనే, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల విషయంలో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది.
“నాయకులు చేసే విమర్శలు నిజాయతీగా, అథెంటిక్‌గా ఉంటేనే ప్రజలు విశ్వసిస్తారు. అదే సమయంలో బీసీ హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం లేదు. గతంలో అనేక పార్టీలు బీసీ రిజర్వేషన్ల విషయంలో హామీలు ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిర్లక్ష్యం చేయడం తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే వ్యవహరిస్తోంది.
మన రాజకీయాలు కులమతాలకు అతీతంగా ఉండాలి. కానీ, కొందరు బీజేపీ నాయకులపై దాడులు చేయడం ప్రారంభించారు. ఇప్పటి పరిస్థితి చూస్తే, మా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు గారిని అడ్డుకోవడంలో కొందరు పరోక్షంగా కుట్రలు పన్నుతున్నట్లు ఉంది. ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సమాజ శక్తిని అణగదొక్కే ప్రయత్నమే.
కాంగ్రెస్ కు రాజకీయాలు, ఎన్నికలు ముఖ్యం కావచ్చు, కానీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తోంది. అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ అనే మాట తెలంగాణలో ప్రతి గడపకు చేరింది.
గతంలో రేవంత్ రెడ్డి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా బ్లాక్ మెయిల్ చేసి, అక్రమ సంపాదనతో రాజకీయాలు నడిపిస్తున్నారని అనేక వార్తలు వచ్చాయి. ఈరోజు కూడా యూట్యూబ్ ఛానళ్ల ద్వారా అలానే వ్యవహరిస్తున్నారు.
మీరు ఎంత రెచ్చగొట్టినా జూబ్లీ హిల్స్ ప్రజలు బిజెపి వైపు బలమైన మద్దతు చూపుతున్నారు. ఈ రోజు దేశభక్తులపై, ఆత్మగౌరవంతో ఉన్న వారి మీద మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యంగా మా సోదరిమనులు, మహిళలు చేపట్టిన కుంకుమార్చన కార్యక్రమాన్ని అడ్డుకోవడం చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి గారు ఈ అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలి.
ఈ రోజు మా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జాతీయ జెండాను, దేశభక్తి స్ఫూర్తిని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కుతంత్రాలు చేయడం దురదృష్టకరం. రాహుల్ గాంధీ, సంఘ విద్రోహ శక్తులతో కలిసి భారతదేశాన్ని నాశనం చేయాలని కుట్ర చేయడంతో పాటు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల విషయంలో చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలి. వ్యక్తిగతంగా, నేను రెండుసార్లు శాసనసభ్యుడిగా అచ్చంపేట ప్రజల ఎన్నికైన వ్యక్తిని. నా జీవిత లక్ష్యం సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి, సంక్షేమం అందించడం. ప్రజల సంక్షేమమే నా ధ్యేయం. అందుకే నా పూర్వ అనుభవాన్ని, నినాదాలను ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
ప్రజలు ఆశించే అభివృద్ధి, కోరిక నెరవేరాలంటే బిజెపి తప్ప ఇంకొకటి లేదు. నేను సామాన్య కార్యకర్తలాగా పనిచేసి తెలంగాణలో, బీజేపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం. నిమ్న వర్గాల ప్రజలకు, ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమం అందాలని పనిచేయాలనే లక్ష్యంతోనే ఈ రాజకీయాల్లో ఉన్నాను