– మేం ఉద్యమకారులం కాదు
– గాలి ఎటు వీస్తే అటు వెళ్ళే రాజకీయ నాయకులం
– కళ్యాణ్ నగర్ టీజీ జెన్కో ఆడిటోరియం లో ప్రముఖ కవి అందే శ్రీ ప్రచురించిన హసిత భాష్పాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: పుస్తక రచయిత శ్రీరామ్ పాలమూరు బిడ్డ కావడం సంతోషం. తెలంగాణ సమాజం కవులకు స్ఫూర్తి ని ఇచ్చిన గడ్డ. నిజమైన ఉద్యమకారులు ఎవరూ నేను ఉద్యమకారుడిని అని చెప్పుకోరు. అందే శ్రీ ఎప్పుడు నేను ఉద్యమకారుడిని అని చెప్పుకోలేదు.
ఉద్యమకారుడిని అని చెప్పుకున్న వాళ్లకు టీవీలు, పేపర్లు, వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. మేం ఉద్యమకారులం కాదు. గాలి ఎటు వీస్తే అటు వెళ్ళే రాజకీయ నాయకులం. గూడ అంజయ్య, అందే శ్రీ, గద్దర్, గోరేటి వెంకన్న లాంటి కవులు తెలంగాణ ప్రజల్లో స్పూర్తి నింపారు. అందే శ్రీ, గద్దర్ తెలంగాణ ప్రజల స్వేచ్ఛ ను ఆకాంక్షించారు.
నేను ఎవరిని శత్రువు గా చూడను. నేను శత్రువు గా చూడాలంటే వారికి ఆ స్టాయి ఉండాలి. 2006 నుంచి ప్రారంభమైన నేను 17 ఏళ్ల లో ముఖ్యమంత్రి అయ్యాను. తెలంగాణ ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని వారి అభ్యున్నతి కోసం ఉపయోగిస్తా. నాకు నచ్చని వారిపైన అధికారాన్ని ఉపయోగించే మూర్ఖుణ్ణి కాదు.
తెలంగాణ ప్రజలు నాపైన పెద్ద బాధ్యత పెట్టారు. నా గెలుపే నా ప్రత్యర్థులకు దుఃఖం. నేను సీఎం గా సంతకం పెట్టడం వాళ్ల గుండెలపైన గీత పెట్టినట్లు. 109 దేశాల నుంచి వచ్చిన సుందరీమణులతో జయ జయ హే తెలంగాణ పాట పాడించాను..ఇంత కంటే ఇంకా ఏం కావాలి? తెలంగాణ తల్లి ముందు వారిని మోకారిల్లే లా చేశాను.
భవనాలు ఎవరైనా కడతారు. అద్దాల మేడలు, రంగుల గోడలు అభివృద్ధి కాదు. పేదలు ఆత్మగౌరవం తో తలెత్తు కోవడమే అభివృద్ధి. 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లతో పేదలు ఆత్మగౌరవం తో బతుకనున్నారు. రేషన్ కార్డు లు, సన్న బియ్యం తో పేదల ఆత్మగౌరవం పెంచాం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నా పదవిని వాడను. పేదల కోసమే పని చేస్తా. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా.
2047 నాటికి తెలంగాణ ను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మార్చడమే నా లక్ష్యం. ప్రపంచంలో గొప్ప రాష్ట్రం గా తెలంగాణ ను మారుస్తా.