ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు సహా పలువురు ఏపీ ఎంపీలు కేంద్ర మంత్రులను కలిశారు. లోకేష్ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు ఎరువుల–రసాయనాల మంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్రంలో యూరియా కొరతను తీర్చాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై రహదారి భద్రత, ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, లాజిస్టిక్స్, పాసింజర్ కారిడార్ల సమన్వయం, కొత్త రోడ్ల మంజూరు వంటి అంశాలను వివరించారు.
ఈ సమావేశాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు సహా ఇతర ఎంపీలు కూడా పాల్గొన్నారు సందర్భంగా కూటమి ఎంపీలు మంత్రి నారా లోకేష్ ని ఘనంగా సత్కరించారు.