– ఆ మైనింగ్ ను కాంగ్రెస్ నేతలకే ఇచ్చారు
– జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతామని ఇప్పటివరకు పెట్టలేదు
– పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ గౌడ్ అని పిలిచారా ?
– మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి నిన్న సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా వృత్తి కులాలకు ఏవైనా వరాలు ప్రకటిస్తారని ఆశించారు. పాపన్న గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడతారని అనుకున్నాం. ఎక్కడకు వెళ్లినా కేసీఆర్ ను తిట్టడమే సీఎం ఎజెండా గా పెట్టుకున్నారు. రాత్రి నిద్రలో కూడా సీఎం రేవంత్ కేసీఆర్ నే కలవరిస్తున్నారు. ప్రతి దానికి కేసీఆర్ కారణం అనడం తప్ప రేవంత్ చేసిన మంచి పని ఏదీ లేదు.
ఎన్నికల్లో గౌడ సోదరులకు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది.
ఆ హామీల అమలు గురించి మాట్లాడకుండా రేవంత్ వేరే విషయాలు మాట్లాడుతున్నారు. ఎన్నికలపుడు అబద్దాలే.. ఇపుడు అబద్దాలేనా ?
కేసీఆర్ యాభై శాతం లోపు రిజర్వేషన్లకు చట్టం తెచ్చారని రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు.
కేసీఆర్ 62 శాతం రిజర్వేషన్ల కోసం ప్రయత్నించారు. సుప్రీం కోర్టు వెళ్లి దాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలే. కాంగ్రెస్ నేతలు స్వప్నా రెడ్డి ,గోపాల్ రెడ్డి సుప్రీం కోర్టు వెళ్లి రిజర్వేషన్లకు యాభై శాతం క్యాప్ విధించేందుకు కారణమయ్యారు.
రిజర్వేషన్ల క్యాప్ కు కాంగ్రెస్ నేతలు కారణం కాదని రేవంత్ రాహుల్ , సోనియా ల మీద ఒట్టేసి చెప్పగలరా ? రేవంత్ అబద్దాలను నమ్మెందుకు ఎవరూ సిద్ధంగా లేరు. 20 నెలల్లో 700 మంది గీత కార్మికులు వివిధ ప్రమాదాల్లో మరణించారు. .వారికి ఎక్స్ గ్రేషియా కూడా చెల్లించడం లేదు.
వైన్ షాపుల్లో గౌడ సోదరులకు 25 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇవ్వలేదు.
బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆ హామీని అమలు చేసే దమ్ము లేక కేసీఆర్ పై నెపం నెడుతున్నారు.
కుల వృత్తులకు కేసీఆర్ హయాం లో అమలైన పథకాలు ఇపుడు తుంగ లో తొక్కారు.
సర్వాయి పాపన్న పాలించిన ప్రాంతాలను మైనింగ్ కు అప్పజెప్పామని రేవంత్ నిరాధార ఆరోపణ చేశారు. పాపన్న పాలించిన ప్రాంతాలను పురావస్తు శాఖ కు అప్పగిస్తూ జీవో ఇచ్చింది కేసీఆర్ పాలనలోనే రేవంత్ హయాం లోనే పాపన్న పాలించిన ప్రాంతాలను మైనింగ్ కు ఇచ్చారు.
ఆ మైనింగ్ ను కాంగ్రెస్ నేతలకే ఇచ్చారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతామని ఇప్పటివరకు పెట్టలేదు. కల్తీ కల్లు పేరుతో గౌడ సోదరులను జైల్లో పెట్టినందుకు రేవంత్ రెడ్డి ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ గౌడ్ అని పిలిచారా ?
గౌడ సోదరులకు ఇచ్చిన ఏ హామీ అమలు చేయనందుకు రేవంత్ రెడ్డి రేవంత్ గౌడ్ అయ్యారా ? బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం తెచ్చి రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధి చాటుకోవాలి. రేవంత్ రెడ్డి అబద్దాలు తగ్గించి హామీల అమలు పై దృష్టి సారించాలి.
మంచి పనులకు క్రెడిట్ తీసుకుని చెడ్డపనులను కేసీఆర్ కారణమంటే ఊరుకునేది లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి. ప్రెస్ మీట్ లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ ,బీ ఆర్ ఎస్ నేత గౌతం ప్రసాద్ పాల్గొన్నారు.