– నాలుగు దరఖాస్తులు రాకున్నా, లాటరీ జరగకున్నా ఫీజు వాపస్
– ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్
అమరావతి : కొత్త బార్ పాలసీ 2025–28 కింద ఏదైనా బార్‌కు నాలుగు దరఖాస్తులు రాకపోవడం వల్ల లాటరీ జరగకపోతే, అభ్యర్థులు చెల్లించిన అప్లికేషన్ ఫీజు తిరిగి చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ , ప్రొహిబిషన్ కమీషనర్ నిషాంత్ కుమార్ స్పష్టం చేశారు.
కొత్త పాలసీ ప్రకారం ఓపెన్ కేటగిరీలో 840 బార్లు, రిజర్వ్ కేటగిరీ (గీతకులాలు)లో 84 బార్లు లాటరీ ద్వారా కేటాయించబడతాయి. ఒక బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు రావాలి అనే నిబంధన ఉంది. ఒకవేళ లేకపోతే నాలుగు దరఖాస్తులు రాకపోతే లాటరీ నిర్వహణ జరగదని, దాని తేదీ పొడిగిస్తారని గతంలో విడుదల చేసిన రూల్స్ పేర్కొన్నాయి.
అయితే అప్లికేషన్ ఫీజు (రూ. 5 లక్షలు) రీఫండ్ అవుతుందా లేదా అన్న విషయంలో అభ్యర్థుల్లో అనుమానాలు వచ్చాయి. మరోవైపు ఫీల్డ్ ఆఫీసర్లు కూడా ఈ అంశంపై సూచనలు కోరారు.
దీనిపై నిషాంత్ కుమార్ స్పష్టత ఇస్తూ, “నాలుగు దరఖాస్తులు రాకపోవడం వల్ల డ్రా జరగకపోతే అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు తప్పనిసరిగా తిరిగి ఇవ్వబడుతుదన్నారు. ఫీల్డ్ ఆఫీసర్లు ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి, మరింత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసేలా చూడాలని కమిషనర్ ఆదేశించారు.