– నిరసనగా రోడ్డెక్కిన తెలంగాణ బీజేపీ శ్రేణులు
– ఖండించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపి అరుణ, రఘునందన్‌రావు
– ఇది పిరికిపంద సర్కారు: బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా.మేకల శిల్పారెడ్డి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రజా సమస్యలు, నగర అభివృద్ధి అంశాలపై సచివాలయం ఎదుట బీజేపీ చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే కుట్రతో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తో పాటు బిజెపి మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసిన వైనం పలుచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది.
బీజేపీ పోరాటం ఆగదు
– బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా.మేకల శిల్పారెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేపట్టిన పోరాటాలను అణచివేసేలా రాష్ట్ర ప్రభుత్వ కుట్ర. నీళ్లు,డ్రైనేజీ,రోడ్లు,కరెంట్,ట్రాఫిక్ వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. రామంతపూర్, పాతబస్తీ ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితమే ఎన్ని అరెస్టులు, గృహనిర్బంధాలు చేసినా బీజేపీ పోరాటం ఆగదు
గ్రేటర్ హైదరాబాద్ ప్రజా సమస్యలపై “SAVE Hyderabad” పేరుతో సచివాలయం ఎదుట బీజేపీ చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేవెళ్ల పర్యటనలో ఉన్న సమయంలో మొయినాబాద్ వద్ద పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై తలెత్తుతున్న ఆగ్రహాన్ని అణచివేయడానికి ఇలాంటి అక్రమ అరెస్టులు చేస్తూ, తన ఘోర వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం.
చలో సెక్రటేరియట్ లో భాగంగా నాతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంటకేశ్వర్లు , గౌతంరావు , బీజేపీ మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాను. ప్రజా సమస్యలను పరిష్కరించే బదులు, అక్రమ అరెస్టులతో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం.
భాగ్యనగరంలో ప్రజలకు నీళ్లు రావడం లేదు, డ్రైనేజీ వ్యవస్థ కుప్పకూలింది, రోడ్లు గుంతలతో నిండిపోయాయి, కరెంట్–ట్రాఫిక్ వ్యవస్థలు స్తంభించాయి. ఈ పరిస్థితులు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యాన్ని చూపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేసేలా, ప్రజలను చైతన్యవంతం చేసేలా బీజేపీ నాయకులు, కార్యకర్తలు చలో సెక్రటేరియట్ కు నిరసనకు వెళ్లడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. అందుకే ఎక్కడికక్కడ పోలీసులతో అరెస్టులు చేయించింది.
అరెస్టులు చేసినా, ఎన్ని గృహనిర్బంధాలు చేసినా ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం ఆగదు. ప్రజా సంక్షేమం కోసం మాకు ఎన్ని అడ్డంకులు పెట్టినా, బిజెపి వెనుకడుగు వేయదని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి స్పష్టం చేశారు.