– ఫిర్యాదు చేయడానికి వెళితే పెళ్ళి చేసుకున్నాడు
– ఆ మహిళ భర్త ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
– హైకోర్టులో ప్రైవేటు కేసు
– ఆలస్యంగా పొక్కిన ఖాకీ నైజం
అన్నమయ్య జిల్లా: మదనపల్లిలోని సొసైటీ కాలనీకి చెందిన పవన్ కుమార్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగి గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన కలికిరికి చెందిన ఓ మహిళతో వివాహం చేసుకున్నారు. అయితే, కొంతకాలానికే కుటుంబంలో గొడవలు పుట్టాయి. ఈ నేపథ్యంలో న్యాయం కోసం ఆ గృహిణి మదనపల్లె డిఎస్పీ కార్యాలయానికి వెళ్ళింది. దీంతో అక్కడి సీఐ సురేష్ కుమార్ ఈమెను పరియం చేసుకుని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ సంగతిని ఆలస్యంగా తెలుసుకున్న ఆ మహిళ భర్త పవన్ కుమార్… సీఐపై చర్యలు తీసుకోవాలంటూ పీఎంఓ కు ఫిర్యాదు చేశారు. దీంతో పీఎంఓ కార్యాలయం నుండి డీజీపీ కార్యాలయానికి సమాచారం వెళ్ళింది.
అధికారుల ఆదేశాలతో ఈ ఏడాది జూన్ నెలలో సీఐపై కేసు నమోదు అయింది. సురేష్ కుమార్ తల్లిదండ్రులు కులాంతర వివాహం కావడంతో తల్లి కులం రిజర్వేషన్ తో ఉద్యోగం పొందాడని ఆ ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన సురేష్ కుమార్ పై రెవెన్యూ అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నంద్యాల సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ సెలవు పై వెళ్ళినట్టు సమాచారం.