– బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
అమలాపురం: కొబ్బరి, తాటిచెట్లు ఎక్కేవారికి బీమా సౌకర్యం ఉందని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ బీమా సౌకర్యం లో కేంద్ర ప్రభుత్వం 75 శాతం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించే విధంగా ఈ స్కీం అమలు జరుగుతున్న విషయం వివరించారు. కోనసీమ కొబ్బరి ప్రధాన పంటగా ఉన్న నేపథ్యంలో కొబ్బరి కార్మికులు ను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మాధవ్ నొక్కి వక్కాణించారు.
మన ఊరు -మన జెండా
ఎక్కడికి వెళ్లి నా బీజేపీని బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పార్టీని బలోపేతం చేయాలన్నారు. మన ఊరు -మన జెండా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం మాధవ్ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుళ్ళు బాధ్యతలు తీసుకుని ఈ కార్యక్రమం అమలు చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా పదాధికారులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తం కావాలని మాధవ్ కార్యకర్తల సమావేశం లో పిలుపు ఇచ్చారు.
స్ఫూర్తి పేరుతో బహిరంగ సభ
విజయవాడలో ఈనెల 30 వతేదీన డి నోటిఫై ట్రైబ్ తో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు బీజేపీ ఏపీ చీఫ్ పివిఎన్ మాధవ్ ప్రకటించారు. సంచార జాతులు కాదు సదాచార్య వారసులు వారి అభ్యున్నతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమే కృషి చేశారు. సంచారజాతుల అభివృద్ధికి ముగ్గురు సభ్యులతో కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. వీరికి ఆధార్ లేదు… కనీసం కుల ధ్రువీకరణ కూడా ఉండదు. ఈ జాతులు మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాటం చేసిన స్వాతంత్య్ర సమర యోధులు. అయితే ఏపార్టీ కూడా వీరిని పట్టించుకోలేదు. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యాక వీరి సంక్షేమం కోసం ప్రయత్నం ప్రారంభం అయిందన్నారు.