(చాకిరేవు)
ఈ సిగ్గులేని స్క్రోలింగులు చూసి నవ్వొచ్చింది!
పొద్దున :
(సాక్షి స్క్రోలింగ్) ఏపీలో మద్యం ఏరులై పారుతోంది – బాబు పాలనలో కిల్లీకొట్టులో కూడా మద్యం దొరుకుతుంది. ఇప్పుడు మద్యం ఆదాయం చంద్రబాబు జేబుల్లోకి వెళ్తుంది. కొత్తగా మరో 3,736 బార్ షాపులను టీడీపీ నేతల చేతుల్లో పెట్టారు – కల్లుగీత కార్మికుల షాపులనూ టీడీపీ నేతలకే ఇచ్చారు : మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు
సాయంత్రం :
(సాక్షి స్క్రోలింగ్) ఏపీ: మద్యం బార్ షాపుల్లో సిండికేట్ కుట్ర – 840 బార్లలో 72 బార్లకే వచ్చిన అప్లికేషన్లు – 45 బార్లకు మాత్రమే లాటరీకి అవసరమైన దరఖాస్తులు – ఏపీలో మద్యం బార్ల కోసం టీడీపీ సిండికేట్ స్కెచ్ – దరఖాస్తులు వేయకుండా చక్రం తిప్పిన టీడీపీ నేతల సిండికేట్ – కమీషన్ భారీగా పెంచుకుని బార్లను దక్కించుకునే ప్లాన్ – రేపటితో బార్ల దరఖాస్తులకు ముగుస్తున్న గడువు – 10 శాతం బార్లకు కూడా దాఖలు కాని దరఖాస్తులు//
ఆ టీజీఆర్ సుధాకర్ బాబు రాత్రి మంచి బ్రాన్డ్ వేసి పొద్దున్నే మీడియా సమావేశం పెట్టాడా లేదా సజ్జల & టీమ్ మందు త్రాగుతూ కిక్కులో ఈయనకు పొద్దున్నే స్క్రిప్ట్ పంపారా అర్థం కాలేదు.
జనరల్ గా మందు తాగుదాం అనుకునేవారు, మొదట కిళ్లీ షాపుకు వెళతాడా లేదా వైన్ షాపుకు వెళతాడా?
కిళ్లీ కొట్టు వద్ద ఎక్కువకు కొనుక్కోవడం కన్నా పర్మిట్ రూముల వద్ద కూర్చోని హేపీగా తాగుతారు కదా. తర్వాత వాసన రాకుండా కిళ్లీ కొనుక్కొని నములుకొంటూ ఇంటికి వెళతారు కదా. అయినా కిళ్లీ కొట్లు ఎక్కడ వుంటాయి? సాధారణంగా నాన్ వెజ్ హోటల్స్ దగ్గర ఉంటాయి. అంటే టౌన్లల్లో.. పల్లెల్లో వుండవు కదా?
డిజిటల్ పేమెంట్లతో.. బ్రాన్డెడ్ లిక్కర్ అమ్మే ప్రస్తుతం, ఎలా చంద్రబాబు జోబులోకి వెళుతుంది? హోల్ సేల్ గా వేలకోట్ల లిక్కర్ స్కాము చేసి దొరికిపోయిన జగను లెక్కన?! ఇంకా బార్ల దరఖాస్తుల గడువు తీరకుండానే 3,736 బార్ షాపులను టీడీపీ నేతల చేతుల్లో పెట్టారు అని అంటున్నాడు అంటే.. కిక్కులో కాకపోతే మరేమిటి? టిడిపి నాయకులకు కల్లుగీత కార్మికుల సర్టిఫికెట్ ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుంది?
సాయంత్రానికి ఇంకా బాగా ఎక్కినట్లుంది తాడేపల్లి నుండి సాక్షిలో స్క్రోలింగ్ వేయించే సజ్జల టీముకు.
నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ అని నిబంధనలు పెట్టారు కదా? దరఖాస్తులు రాలేదంటే ఎలా కేటాయిస్తారు? అయినా వైకాపా నాయకులను వెయ్యనివ్వకుండా ఎవరన్నా తాళ్లతో కాళ్ళూ చేతులు కట్టేశారా? సిండికేట్ అవ్వకుండా వైకాపా పాల్గొనవచ్చు కదా? తక్కువ కమీషన్ తో.. సోషల్ సర్వీసు చేయడానికి వైకాపా నాయకులు దరఖాస్తు చేస్తే.. లాటరీలో తగలవచ్చు కదా? ఏదన్నా నిబంధనలు పాటించకుండా జరిగితే రిమాండ్ సింహా పొన్నవోలు సుధాకర్ రెడ్డితో హైకోర్టులో కేసులు వెయ్యవచ్చు కదా?
పర్మిట్ రూములను పెట్టకుండా, షాక్ కొట్టే రేటు చెప్పి, ఎక్కడి నుండి తెప్పించిన మందో చెప్పకుండా.. అదే డిస్టలరీస్ నుండి సింథటిక్ చీప్ లిక్కర్ తయారు చేయించి, క్యాష్ మాత్రం తీసుకొని పిచ్చి బ్రాన్డ్ పేరుతో బుడ్డీ చేతిలో పెట్టి దొబ్బేయ్ అని చెప్పి వేలకోట్లు కొట్టేసి, దొరికిన భారతీ డైరక్టర్ నుండి జగన్ డీఫాక్టో సీఎం ధనుంజయరెడ్డి వరకు బొక్కలో వున్నారు.
10 శాతం కూడా దరఖాస్తులు రాలేదని బాధపడుతున్న వైకాపాలోలా, పర్మిట్ రూముల లేకుండా వుండి వుంటే లక్షల దరఖాస్తులు వచ్చేవి. ప్రతిదీ నిబంధనల ప్రకారం, ఎమ్మార్పీల ప్రకారం అమ్మాలి. లేదంటే కేసులు నమోదు అని వైన్ షాపులకు పెట్టిన బాబు నిబంధనలకు భయపడి, బార్లకు పోటీలు పడడం లేదు. అద్దెల నుండి రెస్టారెంట్ వర్కర్స్ వరకు భరించి, పర్మిట్ రూముల నుండి బార్లకు రప్పించి ఆర్జించేది ఏమీ ఉండదు అనే నైరాశ్యంలో ఉన్నట్లున్నారు.
అయినా ముందే కూసిన కోయిల లెక్కన.. ముందుగానే ఊహించి భ్రమలను, అబద్దాలను స్క్రోలింగులుగా వేసే కిక్కులో పార్టీని నడుపుతున్న వైకాపాను చూసి నవ్వొచ్చింది.