విశాఖ ఉక్కులో ఉద్యోగాల కోత, ఉత్పత్తి పతనం: వాస్తవాలు
1. ఉద్యోగుల సంఖ్య మరియు కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు
వైసీపీ ప్రభుత్వ హయాంలో: విశాఖ ఉక్కు కర్మాగారంలో ఆర్థిక సంక్షోభం తీవ్రమైనప్పుడు, ప్లాంట్ నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడానికి తీవ్ర ఒత్తిడి ఎదురైంది. ఈ సమయంలో, అధికారంలో ఉన్నప్పుడు, సుమారు 5,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులను దశలవారీగా తొలగించారు. ఈ తొలగింపులు కార్మికుల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించాయి. ప్లాంట్ ఉత్పత్తి పడిపోవడంతో అనేక విభాగాల్లో పనిలేకుండా పోయింది.
VRS వివరాలు: ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందలేదు. దీంతో నిరంతర ఆందోళనలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో అనేక మంది శాశ్వత ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (VRS) కింద బయటికి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 2,000 మంది శాశ్వత ఉద్యోగులు VRS కింద ప్లాంట్‌ను వీడారు.
– ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య: ఈ పరిణామాల వల్ల గతంలో 17,000 మందికి పైగా ఉన్న శాశ్వత ఉద్యోగుల సంఖ్య 10,000 మందికి తగ్గింది. అలాగే, కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య కూడా భారీగా తగ్గింది.
2. బ్లాస్ట్ ఫర్నేస్‌ల మూసివేత మరియు ఉత్పత్తి పతనం
బ్లాస్ట్ ఫర్నేస్-1 మూసివేత: వైసీపీ ప్రభుత్వ చివరి దశలో, ముడి సరుకు కొరత మరియు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్లాంట్ నిర్వహణకు నిధులు లేకపోవడంతో, మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లలో ఒకటైన బ్లాస్ట్ ఫర్నేస్-1 ను ఏప్రిల్ 2024లో మూసివేశారు.
ఉత్పత్తి సామర్థ్యం: ఈ మూసివేత ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. ప్లాంట్ పూర్తి సామర్థ్యం 7.3 మిలియన్ టన్నుల ద్రవ ఉక్కు ఉత్పత్తి అయితే, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉత్పత్తి 20-30% సామర్థ్యంతో మాత్రమే నడిచింది.
3. పునరుజ్జీవం: ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చర్యలు
ప్రైవేటీకరణ రద్దు మరియు చర్చలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామి, నిర్మలా సీతారామన్ గారితో నడి రాత్రి దాటాక కుమారస్వామిని వెంటబెట్టుకుని మరీ తెల్లవారుజామున 2.30 గంటలకు చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేస్తూ, ఆర్థిక ప్యాకేజీకి కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చింది.
ఆర్థిక ప్యాకేజీ: కేంద్రం ₹11,440 కోట్ల భారీ పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ప్లాంట్‌కు ఆర్థికంగా ఊపిరి పోసింది.
ఉత్పత్తి పునఃప్రారంభం: ఆర్థిక సహాయం మరియు ముడి సరుకు సరఫరా మెరుగుపడటంతో, మూసివేసిన బ్లాస్ట్ ఫర్నేస్-1 సెప్టెంబర్ 2024లో తిరిగి ప్రారంభమైంది.
* ఉత్పత్తిలో అద్భుతమైన పెరుగుదల:
* సెప్టెంబర్ 2024: 5,170 టన్నులు
* ఫిబ్రవరి 2025: 13,622 టన్నులు
ఈ ఆరు నెలల కాలంలో ఉత్పత్తి ఏకంగా 163% పెరిగింది. ఇది కేవలం ఉత్పత్తిని పునఃప్రారంభించడం మాత్రమే కాదు, దాన్ని స్థిరీకరించి, వేగవంతం చేస్తున్నట్లు స్పష్టం చేస్తోంది.
ఉద్యోగ భద్రతపై భరోసా: ప్రస్తుతం, ఉద్యోగాలను తొలగించడం లేదు, ప్లాంట్ పునరుద్ధరణ దశలో ఉండటంతో ఉద్యోగుల భద్రతకు హామీ లభించింది. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు జరిగే అవకాశం కూడా ఉంది.
వైసీపీ దుష్ప్రచారానికి కారణం:
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్లాంట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొని, ప్రైవేటీకరణ నిర్ణయానికి దగ్గరైంది. ఉద్యోగాలు కోల్పోవడం, ఉత్పత్తి పడిపోవడం వంటివి అదే సమయంలో జరిగాయి. కానీ ఇప్పుడు, కూటమి ప్రభుత్వం ప్లాంట్‌ను కాపాడి, పునరుద్ధరణ పనులు చేపడుతుంటే, వైసీపీ అనవసర భయాందోళనలు సృష్టిస్తోంది. ఈ ప్రచారం రాజకీయ లబ్ధి కోసమే తప్ప, ప్లాంట్, ఉద్యోగుల, కార్మికుల సంక్షేమం కోసం కాదు. వైజాగ్ ప్రజల కోసం అంతకన్నా కాదు. రాష్ట్రంలో అలజడులు రేపి, అశాంతిని సృష్టించడానికి నిత్యం ప్రయత్నిస్తోంది.
ఈ అబద్దాలు వైజాగ్ స్టీల్ ప్లాంటుకే పరిమితం కాదు. అటు అమరావతి మునిగింది అనే దుష్ప్రచారం నుండి పెన్షన్ల రద్దుతో ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారనే వరకు, పచ్చి అబద్దాలతో పెడబొబ్బలు పెడుతోంది. ప్రజలు వైకాపాను పట్టించుకోవడం మానేశారు. అయినా ఇంకా దానిని నముకొన్న వారి కోసం ఈ వివరణ.
