– ఎక్కడా యూరియా కొరత లేదని కలెక్టర్లు చెప్పారు
– కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ యూరియా కొరత
– కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే
– కాళేశ్వరం ప్రాజెక్టు , ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి
– నిజామాబాద్ జిల్లా ఇందూర్ లో బూత్ స్థాయి సభ్యుల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు
ఇందూర్: కార్యకర్తల గుండెల్లో ధైర్యం, సాహసాన్ని నింపుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఇందూరు పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాదాపు రూ.25 లక్షల వరకు ధర్మపురి అర్వింద్ ట్రస్ట్ ద్వారా కార్యకర్తల సంక్షేమం కోసం వితరణ చేశారు.
కార్యకర్తల పట్ల అర్వింద్ కి ఉన్న ప్రేమ గొప్పది. మానవతావాదంతో, బీజేపీ నాయకుడిగా ఒక బాధ్యతతో ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్న అర్వింద్ కి అభినందనలు. భారతదేశంలో ఏ ఎంపీ చేయలేని సేవలను ధర్మపురి అర్వింద్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు.
నేను చాలాకాలం పాటు ఇందూర్కు యువమోర్చా ఇంచార్జ్‌గా, కార్యకర్తగా వచ్చేవాడిని. విద్యార్థి పరిషత్ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రావడం ఆనందంగా ఉంది. నిజామాబాద్‌లో భారతీయ జనతా పార్టీ చరిత్ర మరువలేనిది. రాబోయే రోజుల్లో జడ్పీ చైర్మన్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంటుంది. క్రమంగా నిజామాబాద్‌లో బీజేపీ బలం మరింత పెరుగుతోంది.
అర్వింద్ ధర్మపురి నిజామాబాద్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్‌కు పసుపు బోర్డును తీసుకువచ్చి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ప్రారంభించుకోవడం జరిగింది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు రావడం ప్రధాని నరేంద్ర మోదీ గొప్పతనం, అర్వింద్ అలుపెరుగని ప్రయత్నం.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో దాదాపు 32 లక్షల మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. తెలంగాణలో రైతుబంధు బంద్ అయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల పేరుతో, గ్యారంటీల పేరుతో అనేక వాగ్ధానాలు చేసి మాట తప్పింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు.
రైతు భరోసా సరిగ్గా ఇవ్వలేదు. 19 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున పేదలకు ఇళ్లు కడతామని చెప్పారు, కానీ అమలు చేయలేదు. అన్నీ అబద్ధాలతోనే కాంగ్రెస్ కాలయాపన చేస్తోంది.
ఓటు చోరీతోనే బీజేపీ గెలుస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఏ ఓటర్ లిస్టుతో బీజేపీ సభ్యులు గెలిచారో, అదే లిస్టుతో కాంగ్రెస్ నాయకులు కూడా గెలిచారు. ఏ యంత్రాంగం ఎన్నికలు నిర్వహించిందో, అదే యంత్రాంగం నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా 8 ఎంపీలను గెలిపించుకుంది. ఇది ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయింది. అందుకే కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.
42 శాతం బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్, మరోవైపు 10 శాతం మతపరమైన రిజర్వేషన్లు ముస్లింలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తోంది. నేను ముందే చెప్పాను. స్థానిక ఎన్నికల్లో 46 శాతం రిజర్వేషన్లు బీజేపీ తరఫున బీసీలకే ఇస్తామని. ఎందుకంటే బీసీలకు చెందాల్సిన రిజర్వేషన్లు బీసీలకే ఇవ్వాలి.
కాంగ్రెస్ నాయకులు యూరియా కొరత అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఎక్కడా కూడా యూరియా పంపిణీని ఆపలేదు. తెలంగాణకు అవసరమైనంత మేరకు యూరియా సరఫరా చేసింది. తెలంగాణలో నడుస్తోంది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ యూరియా కొరత మాత్రమే. నేను పలు జిల్లాల్లో పర్యటించి కలెక్టర్లతో మాట్లాడాను. ఎక్కడా కూడా యూరియా కొరత లేదని వారు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం బీఆర్ఎస్. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగినది కూడా బీఆర్ఎస్ పాలనలోనే. అందుకే రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు. కేవలం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ వెళ్తున్నారు. వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ గారితో పాటు బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.
రైల్ కనెక్టివిటీని బలపరిచే దిశగా నిజామాబాద్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వే లైన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో నిర్మాణం చేపట్టింది. అనేక జాతీయ రహదారుల నిర్మాణం కూడా ఎన్డీయే ప్రభుత్వం చేపట్టింది.
నరేంద్ర మోదీ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. గ్రామీణ పేదలకు ఉచిత బియ్యం, మరుగుదొడ్లు, యువతకు స్వయం ఉపాధి రుణాలు.. ఇవన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయి.
గ్రామాల్లో రోడ్లు, మరుగుదొడ్లు, వీధి దీపాలు, స్మశాన వాటికలు, రైతు వేదికలు, హరితహారం కింద మొక్కలు నాటడం..ఇవి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే అమలవుతున్నాయి. ప్రజలు ఇవన్నీ మోదీ ప్రభుత్వం ఇస్తోందని బలంగా చెబుతున్నారు.
అందుకే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను, గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో ఓడించి, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 73, 74వ సవరణల ప్రకారం కేంద్రం ఇస్తున్న నిధులను దారిమళ్లించాయి.
స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసినప్పటికీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదు. కారణం. ఓటమి భయం. పైగా ప్రధాని నరేంద్ర మోదీ గారిని కన్వర్టెడ్ బీసీ అని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారిని “దేశ్‌ముఖ్” అంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.
కన్వర్టెడ్ బీసీ అంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు మందు మీ పార్టీ పరిస్థితి చూసుకోండి. అనేకమంది కన్వర్ట్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీలో చేరేందుకు ముందుకొస్తున్నారు. బీజేపీలో మార్పు రావాలంటే, అభివృద్ధి జరగాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలి. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.
2028లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేలా ప్రజలు మెజారిటీ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే. దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి.
ఒకరు ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ను రక్షిస్తున్నారు. మరొకరు ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిస్తే, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి మరింత అండగా నిలుస్తుంది. భారతీయ జనతా పార్టీలో చేరికలను స్వాగతిస్తాం. రూలింగ్ పార్టీ నుంచి అలాగే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బీజేపీలో చేరేందుకు చూస్తున్నారు.
రానున్న రోజుల్లో తెలంగాణలో పెను పరివర్తన రానుంది. ఈ మార్పు కోసం బీజేపీ ప్రజా ఉద్యమాలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది. అనేక తప్పిదాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, మోసపోతున్నారు.
కాబట్టి తెలంగాణలో మార్పు కోసం బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి. బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యం. ప్రజాస్వామిక తెలంగాణగా మారుస్తుంది. అందుకే బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం.