– బండి సంజయ్ దేశ్ముఖ్ అనే ఆరోపణను నిరూపించండి
– కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది దొంగ ఓట్లతోనేనా?
– 42 శాతం రిజర్వేషన్లు మొత్తం బీసీలకే ఇస్తామని ప్రకటించే ధైర్యం ఉందా?
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీసీ కాదని, దేశ్ముఖ్ అని విమర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశ్ముఖ్ అనే ఆరోపణను నిరూపించకపోతే, మహేశ్ కుమార్ గౌడ్ పై చట్టపరమైన చర్యలు తప్పవు.
బండి సంజయ్ , బిజెపి ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని చేసిన ఆరోపణలను కూడా ఖండిస్తున్నాం. ఆ వ్యాఖ్యలు నిరూపించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రిగ్గింగ్ సంస్కృతి కాంగ్రెస్ పార్టీకే చెందింది. మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ వారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం గురించి ఆయనకు ఏమి తెలుసు?
బండి సంజయ్ కుమార్ సారథ్యంలో బిజెపి, బీఆర్ఎస్ నిరంకుశ పాలనపై పోరాటం చేసింది. బిజెపి పోరాటాల ఫలితంగానే నిరంకుశ బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. బండి సంజయ్ కుమార్ కి ప్రజల్లో అపారమైన ఆదరణ ఉంది. ఆయనపై విమర్శలు చేసినప్పుడు, మహేష్ గౌడ్ ని చూసి ప్రజల్లో ఎలాంటి స్పందన రాలేదు.
కిషన్ రెడ్డి , బండి సంజయ్ కుమార్ , ఇతర బిజెపి నాయకులు అనేక పోరాటాలు, యాత్రలతో ప్రజల మద్దతు పొందారు. తెలంగాణ పోరుయాత్ర ప్రజాసంగ్రామ యాత్ర, వంటి అనేక యాత్రలు చేసి ప్రజాదరణ పొందారు. మహేష్ కుమార్ గౌడ్ గతంలోనే బండి సంజయ్ గారు బీసీ అంటూ మాట్లాడారు. ఇప్పుడు అదే నోరు దేశ్ముఖ్ అంటోంది. ప్రజలు ఈ రెండు నాల్కల ధోరణిని గమనిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ వ్యవస్థపై నమ్మకం లేదు. EVMలపై నమ్మకం లేదు. చివరికి ప్రజాస్వామ్యంలో దేవుళ్లైన ఓటర్లపైనా నమ్మకం లేదు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది దొంగ ఓట్లతోనేనా? దేశంలో మూడోసారి మోదీ గెలవడం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుంది. ఈ ప్రజా తీర్పే కాంగ్రెస్కు గుదిబండైంది. ఇక కాంగ్రెస్కు బతికిబట్టగట్టే ఛాన్స్ లేదు.
కరీంనగర్లో మరోసారి బండి సంజయ్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. అందుకే కాంగ్రెస్ ఓట్ చోరీ అంటూ గందరగోళం సృష్టిస్తోంది.కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిపై, బిజెపి ఎంపీలపై మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు మతిస్థిమితం లేనివిగానే కనిపిస్తున్నాయి.
42 శాతం బీసీలకు చెందాల్సిన రిజర్వేషన్లలో 10 శాతం రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలని ప్రయత్నించింది. కాంగ్రెస్ పార్టీ. బీసీలు కానివారికి రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని నిలదీస్తున్నారు బండి సంజయ్ . అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కుట్రలను బిజెపి ఎంపీలు ప్రజలకు స్పష్టంగా వివరిస్తున్నారు.
42 శాతం బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు కేటాయించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ… నిజంగా ప్రజల ముందుకు వచ్చి.. 42 శాతం రిజర్వేషన్లు మొత్తం బీసీలకే ఇస్తామని ప్రకటించే ధైర్యం ఉందా? ఇప్పటికైనా అహంభావాన్ని విడిచిపెట్టాలి. మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతగా ప్రవర్తించాలి.