– అందుకే బలుపు మాటలు
– రేవంత్ రెడ్డిది బజారు భాష
– అది నోరా.. మోరా ?
– ఓయూ లో కంచెలు ఎందుకు ఏర్పాటు చేశావు రేవంత్ రెడ్డి ?
– మృగత్వానికి ప్రతి రూపాలు కాంగ్రెస్ పాలకులే
– ప్రజలకు వ్యతిరేకంగా తుపాకీ పట్టిన మానవమృగం రేవంత్ రెడ్డి
– బుర్రా వెంకటేశం చీఫ్ సెక్రెటరీ కాకుండా కుట్ర
– శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి ,మాజీ మంత్రి జోగు రామన్న ,కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు జి .దేవీ ప్రసాద్, బాలరాజ్ యాదవ్ ,పల్లె రవికుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర చారి, కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన బజారు భాష ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫార్మ్ హౌజ్ లో మానవ మృగాలు ఉన్నాయని అనడం తీవ్రమైన విషయం. కేసీఆర్ కు, తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. అహింస పద్ధతుల్లో తెలంగాణ తెచ్చిన మరో గాంధీ కేసీఆర్. మృగత్వానికి ప్రతి రూపాలు కాంగ్రెస్ పాలకులే.
ఎమర్జెన్సీ తో ప్రజల హాహాకారాలు చేపించిన ఇందిరాగాంధీ మృగత్వానికి ప్రతీక. నాడు ఢిల్లీ లో టర్క్ మెన్ గేట్ దగ్గర వేలాది పేదల ఇండ్లు కూల్చిన మృగత్వం కాంగ్రెస్ పార్టీ సొంతం. 69 ఉద్యమం లో వందలాది మందిని పొట్టన పెట్టుకున్న మృగత్వం కాంగ్రెస్ పార్టీది.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మృగత్వం ఆనవాళ్లు వంట పట్టించుకున్నారు. హామీలను నెరవేర్చడం చేతకాకే సీఎం రేవంత్ రెడ్డి పిచ్చి భాష మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ కు అధికారం తో ఒళ్ళు కొవ్వెక్కింది ..అందుకే బలుపు మాటలు మాట్లాడుతున్నారు.
సీఎం మాటలకు విశ్వసనీయత లేదు. అది నోరా.. మోరా ? యూరియా ఇవ్వని అసమర్ధుడు రేవంత్ రెడ్డి. గతంలో ఏ కాంగ్రెస్ సీఎం ఇంతటి నీచమైన భాష మాట్లాడలేదు. రేవంత్ ఓయూ ను స్టాన్ఫర్డ్ ,ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు చేస్తా అనడం హాస్యాస్పదం. ప్రజలను క్షోభ పెడుతూ రేవంత్ మాయమాటలు చెబుతున్నారు.
పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వంద సీట్లు గెలుస్తామంటున్నాడు. ముందు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకోవాలి. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే, సీఎం రేవంత్ రెడ్డి కి రాజకీయ సమాధి తప్పదు. ప్రగతి భవన్ కంచెలు తీశామని చెబుతూ ఓయూ లో కంచెలు ఎందుకు ఏర్పాటు చేశావు రేవంత్ రెడ్డి ?
రేవంత్ రెడ్డి సీఎం పోస్టుకు గౌరవం పెంచేలా మాట్లాడాలి తప్ప పిచ్చి వాగుడు వాగితే ప్రజలే తగిన బుద్ది చెబుతారు. కేసీఆర్ హయాంలో కట్టిన భవనాలకు రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేస్తున్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను మానవ మృగమని సీఎం రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారు.
రేవంత్ రెడ్డి ఎన్నడూ తెలంగాణ ఉద్యమం లో లేడు. రేవంత్ కేసీఆర్ పై వాడిన భాష ను ఓ ఉద్యమ కారుడిగా నేను ఖండిస్తున్నా. కేసీఆర్ పాలన లో లోపాలు ఉంటే ప్రశ్నించవచ్చు. కానీ ఉద్యమ కారుడు కేసీఆర్ ను తెలంగాణ గడ్డ మీద అనుచితంగా మాట్లాడితే సహించేది లేదు. కేసీఆర్ ను సీఎం తిడుతుంటే చప్పట్లు కొట్టే వారు ఉద్యమ కారులు కానే కారు.
రేవంత్ రెడ్డి నిన్న ఓయూలో అపరిచితుడిలా మాట్లాడారు. కేసీఆర్ దీక్ష చేసినప్పుడు తెలంగాణ వ్యతిరేక శిబిరంలో ఉన్నవాళ్లు మానవ మృగాలు. కోదండరామ్ ను ఎమ్మెల్సీ చేయకుండా మేము ఎందుకు ఆపుతాము? బీసీ నేత దాసోజు శ్రవణ్,ఎస్టీ నేత కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీలు కాకుండా అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్సీఎంగా మారారు.
ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి ఒక్కరే పోలేదు. 2017 లో సీఎం హోదాలో కేసీఆర్ ఓపెన్ మీటింగ్ కు వెళ్లి ఓయూ శతాబ్ది ఉత్సవాలకు వెళ్లారు. నిన్న రేవంత్ రెడ్డి ఓయూకు పోలీసుల పహారాలో,కాంగ్రెస్ కార్యకర్తలకు పాసులు ఇచ్చుకుని వెళ్లారు. హెచ్.సి.యూ భూములు అమ్ముకునే వాళ్ళు మానవ మృగాలు. లగచర్లలో గిరిజన రైతులపై లాఠీచార్జి చేసిన వాళ్ళు మనవమృగాలు.
రేవంత్ రెడ్డి ఓయూలో మాట్లాడిన భాష దుర్మార్గం. విజ్ఞత లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఇద్దరు బీసీ బిడ్డలు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు అయ్యారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ గా బీసీలకు అవకాశం కేసీఆర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి చేసింది మాత్రమే లెక్క అంటే ఎట్లా?
బుర్రా వెంకటేశం చీఫ్ సెక్రటరీ కాకుండా ఒత్తిడి చేసి, పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ ను చేశారు. బుర్రా వెంకటేశం చీఫ్ సెక్రెటరీ కాకుండా కుట్ర చేశారు. రేవంత్ రెడ్డి మాటలు మానవులు మాట్లాడే భాష కాదు. రేవంత్ రెడ్డి వెంటనే కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలి. సీఎంను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలి. దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడని మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.
దేశ చరిత్రలో కేసీఆర్ 11 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేశారు. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా తుపాకీ పట్టిన మానవమృగం రేవంత్ రెడ్డి. 1969లో 400 మంది విద్యార్థులను కాల్చిచంపిన కాంగ్రెస్ మానవమృగం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో 1200 మంది చావుకు కారణం అయిన కాంగ్రెస్ మానవ మృగం. సీఎం మానసికస్థితిపై మాకు అనుమానం ఉంది