– స్మార్ట్ గవర్నమెంట్… స్మార్ట్ ఆలోచన
– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం: రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెడుతూ రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా లబ్ధిదారులకు స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయడం మంచి ఆలోచన అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్(వాసు) అన్నారు. స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే నగరంలో మంగళవారం ప్రారంభించారు.
స్థానిక 13వ డివిజన్ అంబేద్కర్‌నగర్‌లోని రేషన్ షాపు సమీపంలోని వద్ద లబ్ధిదారులకు ఆ స్మార్ట్ రైస్ కార్డులను ఇంటింటికీ వెళ్లి అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది తమ కూటమి ప్రభుత్వానికి వచ్చిన స్మార్ట్ ఆలోచన అని అన్నారు. గతంలో మాదిరిగా పెద్ద పుస్తకాల వలే కాకుండా ఏటీఎం, ఆధార్ కార్డుల తరహాలో రాజముద్రతో పాటు లబ్ధిదారు చిత్రం ఉండే విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతోందన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్మార్ట్ రైస్ కార్డులను రూపొందించినట్టు తెలిపారు. ఆ కార్డుపై ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, ఈకేవైసీ స్థితి, రేషన్ సరుకుల వివరాలు, కేటాయించిన పరిమాణం, రేషన్ పొందిన స్థితి, డిపో వివరాలు తెలుస్తాయన్నారు.
13వ డివిజన్ ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కడలి రామకృష్ణ, మరుకుర్తి రవి యాదవ్, బొర్రా చిన్ని, నగరబోయిన రామకృష్ణ, చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, వై దేవీప్రసాద్, కరగాని వేణు, రాయి అప్పన్నబాబు, ఈతలపాటి రవి, మల్లెల శ్రీనివాస్, మళ్ల వెంకటరాజు, సలాది ఆనంద్, మామిడి శ్రీను, బర్ల గిరిజ, కానేటి ప్రభుదాసు, కానేటి కృపామణి, చిన్ని, అధిక సంఖ్యలో మహిళలు, రేషన్ డీలర్లు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.