హైదరాబాద్: దక్షిణ కొరియాలో జరిగిన ప్రతిష్టాత్మక 20వ ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో 1 స్వర్ణం, 2 రజత పతకాలు సాధించి భారతదేశానికి కీర్తి తీసుకువచ్చిన అంతర్జాతీయ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటర్ పడిగ తేజేష్ను శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రులు ఘనంగా సత్కరించాయి.
తేజేష్ ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 179 పతకాలు సాధించడం విశేషం. వీటిలో 114 బంగారు, 42 వెండి, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. తాజా విజయాలతో తేజేష్ దేశ క్రీడా ప్రపంచంలో తన ప్రతిభను మరింత బలపరిచాడు.
సత్కార కార్యక్రమానికి శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రుల చైర్మన్, చీఫ్ కార్డియాలజిస్ట్ ప్రొ. డా. వి.ఎస్. రామచంద్ర, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఆప్తాల్మాలజిస్ట్ డా. తుశారా ఆలూరి హాజరయ్యారు. ఇద్దరూ తేజేష్ కృషి, క్రమశిక్షణ, ప్రతిభను అభినందిస్తూ, ఆయన విజయాలు యువతకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రొ. డా. వి.ఎస్. రామచంద్ర మాట్లాడుతూ, “ పడిగ తేజేష్ను సత్కరించడం మా గర్వకారణం. అతని పట్టుదల, అంకితభావం భారతీయ క్రీడాస్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని అన్నారు.
డా. తుశారా ఆలూరి మాట్లాడుతూ, “శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రులు ఆరోగ్యంతో పాటు యువ ప్రతిభను ప్రోత్సహించడంలో విశ్వాసం కలిగి ఉన్నాయి. తేజేష్ ఒలింపిక్స్లో భారత్కు బంగారు పతకం సాధించే రోజు దూరంలో లేదని మేము నమ్ముతున్నాం” అన్నారు.
ఈ సందర్భంగా తేజేష్ తండ్రి బాల సుబ్రహ్మణ్యం పడిగ మాట్లాడుతూ, “శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రులు ఇచ్చిన గుర్తింపు, ప్రోత్సాహం తేజేష్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. అతను ఒలింపిక్స్లో గోల్డ్ సాధించాలని మా కల” అని తెలిపారు. శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రుల యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది తేజేష్కు శుభాకాంక్షలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.