హైదరాబాద్: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రులు గంగుల కమలాకర్,జోగు రామన్నలతో కలిసి చదువుల తల్లి సరస్వతి అమ్మ వారు కొలువైన బాసరలో మున్నూరుకాపు నిత్యాన్నదాన సత్రానికి రూ.10లక్షల చెక్కు అందించారు.
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఈ సత్రాన్ని నెలకొల్పారు. మాజీ మంత్రి జోగు రామన్న నాయకత్వాన ముధోల్ నియోజకవర్గం మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు రోళ్ల రమేష్, ప్రముఖులు డాక్టర్ కిరణ్ కొమ్రెవార్ ,పిప్పర కృష్ణ, సిద్ధంవార్ వివేకానంద, మంద లింగన్న,కోర్వ శ్యామ్,తోట రాము,చిమ్మన్ పోశెట్టి, వెన్నెల అనిల్ తదితరులు మంగళవారం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లతో సమావేశమయ్యారు.
ఆ తర్వాత ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మాజీ మంత్రి జోగు రామన్నలతో కలిసి రూ.10 లక్షల చెక్కును నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ చైర్మన్ రోళ్ల రమేష్ కు సంఘం ప్రముఖుల సమక్షంలో అందజేశారు.ఈ సందర్భంగా వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ రవిచంద్ర, కమలాకర్ ను శాలువాలతో సత్కరించారు.