– డబ్బులు సంపాదించడమే తప్ప ఎలాంటి నై తిక విలువలు లేని అధికారిణి
– రోజూ ఆమె ధరించే చీర లక్షన్నర రూపాయలు
– ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలకంటే విలువైన 11 విగ్గులు ఆవిడకు ఉన్నాయి
– గతించిన తెలుగుదేశం నాయకుడుతో అంట కాగిన ఆమె ఓ ఆధునిక రజియా సుల్తానా
– నాపై టీడీఆర్ ఆరోపణల సృష్టికర్త ఆమెనే
– ఐఏఎస్ శ్రీలక్ష్మిపై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఫైర్
తిరుపతి: మాజీ సీఎం జగన్ జమానాలో చెలరేగిన సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మిపై వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణా కర్‌రెడ్డి పరోక్షంగా నిప్పులు చెరిగారు. ఆమె అంత అవినీతి చక్రవర్తి ఎవరూ లేరని, అధికారం అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమెను అవినీతి అనకొండ, కీచకి, తాటకి, ఆధునిక రజియా సుల్తానా తో పోల్చారు. తిరుపతి టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో తనను ఆమెనే వివాదంలోకి నెట్టారని మండిపడ్డారు.
గతించిన ఒక టీడీపీ నేతతో అంటకాగిన ఆమె, ‘ఓ ఆధునిక రజియా సుల్తానా’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ భూమన.. ఇంతకాలం తన బాధను వ్యక్తీకరించడం కుదర్లేదని, ఇప్పుడు వ్యక్తీకరించక తప్పడం లేదన్నారు. ఇంకా భూమన ఏమన్నారంటే..
‘ఇవాళ నేను చెప్పే మాటల్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అంగీకరించనూ వచ్చు, లేకపోనూ వచ్చు. కానీ ఆ అధికారిణి మాత్రం అవినీతి అనకొండ. ఆమె మంత్రులను సైతం లెక్కచేయదు. తన శాఖకు తానే మోనార్క్. తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీకి మేము అంగీకరించక పోవడంతో, మా పక్క జిల్లాలోని తెలుగుదేశం నాయకులకు సమాచారం ఇచ్చి నేనోదో అవి అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు చేయించింది.
ఆ అవినీతి అధికారిణి గతంలో మంత్రులను సైతం పూచికపుల్లలా చూ సేది. కనీసం తన శాఖకు సంబంధించిన మంత్రులను కూడా లెక్క చేయదు. ఆమెకు డబ్బులు సంపాదించడమే తప్ప ఎలాంటి నై తిక విలువలు లేని అధికారిణి. ఆమె ఓ తాటకీలాంటిది. కింది స్థాయి అధికారుల పట్ల కీచకి.
తిరుపతిలో తాము రోడ్లు వేస్తున్న సమయంలో అ అధికారిణి టీడీఆర్ బాండ్ల ద్వారా వందల కోట్లు కొట్టేయాలనే ప్లాన్ వేస్తే దానిని తాము అడ్డుకున్నాం. ఇది తట్టుకోలేక ఆమె నెల్లూరు జిల్లా నేతలకు, తాము రెండు వేల కో ట్లు దోచుకున్నామంటూ ప్రచారం చేయించింది. ఆ అధికారిణి గత 35 ఏళ్లుగా ఎక్కడ పనిచేసినా అవినీతికి పాల్పడుతూ వందల కోట్లు దోచుకుంది. ఆమె నిజాయితీ గురించి మాకు బాగా తెలుసు అని అత్యున్నత న్యాయస్థానం సైతం ఆమె గురించి వెటకారంగా వ్యాఖ్యానించింది.
రోజూ ఆమె ధరించే చీర లక్షన్నర రూపాయలు. ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలకంటే విలువైన 11 విగ్గులు ఆవిడకు ఉన్నాయి. ఒక్కో రోజు ఒక్కో విగ్గుతో దర్శన మిస్తుంటారు. ఆమెకు వచ్చే జీతం ఎంత? ఆమె కట్టుకునే చీర ఖరీదు ఎంత?
35 ఏళ్లుగా వందల వేల కోట్ల రూపాయలు లూటీ చేసింది. లంకిణి వంటి చేష్టలున్న మనిషి. ఆమె కోట్లాది విలువైన భూమినే కొల్లగొట్టింది. నా మీద కక్షతో నాపై లేని పోని ఆరోపణలు చేశారు. గతించిన తెలుగుదేశం నాయకుడుతో అంట కాగిన ఆమె ఓ ఆధునిక రజియా సుల్తానా. ఇలాంటి నీచపు అధికారుల వల్ల సమస్యలు వస్తాయి.
ఇంతకాలం నా బాధను నా బాధను వ్యక్తీకరించడం కుదర్లేదు. ఇప్పుడు వ్య క్తీకరిస్తున్నా. ఇలాంటి అధికారుల పట్ల రాజకీయ నాయకులు, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాన్ని తెలియజేస్తు న్నా’ అని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.