– ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే శంకర్
శ్రీకాకుళం: నగర శివారు ప్రాంతాలైన తిలక్ నగర్, గోవిందనగర్, ఎస్బిఐ కాలనీ తదితర ప్రాంతాలు చాపురం పంచాయతీ తదితర ప్రాంతాల్లో ముంపు సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన తిలక్ నగర్, గోవిందనగర్, ఎస్బిఐ కాలనీ తదితర ప్రాంతాలలో శనివారం సాయంత్రం ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానికలతో మాట్లాడుతూ అధికారులతో కలిసి సమన్వయం చేసుకొని నీటిని పూరి స్థాయిలో తొలగించే చర్యలు చేపడతామన్నారు. అలాగే దశాబ్దల కాలంగా ఈ ప్రాంతాలు చిన్నపాటి వర్షానికి కూడా ముంపునకు గురవుతుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సమస్య పరిష్కారంకి అధికారులతో కలిసి చర్చించడం జరిగిందని భవిష్యత్తులో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా పరిష్కార చర్యలపై దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.