– ఘనంగా సూపర్ సిక్స్ -సూపర్ హిట్
– భారీగా హాజరైన మహిళలు
– పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ
పెనమలూరు: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేశామని, రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్త కావాలని ఆకాంక్షించారు. ప్రతి మహిళ పేదరికంలో ఉండకూడదని వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు మహిళల అభ్యున్నతి కోసమే అని అన్నారు.
మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, శ్రీ శక్తి, డీఎస్సీ పరీక్షలలో మహిళలు అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించడం చూస్తుంటే పురుషులకు ఏమైనా అన్యాయం జరుగుతుందా అనే విధంగా చంద్రబాబు మహిళలకు పెద్దపీట వేశారన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, అమరావతి ఉద్యమాన్ని ముందుండి నడిపించింది మహిళలు అని తెలిపారు. చంద్రబాబు నాయుడు ని అక్రమ అరెస్టు చేసినప్పుడు రోడ్డుపై పోరాటాలు చేసింది కూడా మహిళలు. కూటమి విజయం మహిళలదే అని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్నీ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సూపర్ సక్సెస్ అయ్యింది అన్నారు. తమ అంచనాకు మించి మహిళలు ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారన్నారు.
ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టిన 14 రోజుల్లో 94 కోట్ల 50 లక్షలు రూపాయలు మహిళలకు లబ్ధి చేకూరింది అన్నారు. 10500 బస్సులు ఉంటే అందులో 8500 బస్సులు మహిళల ఉచిత ప్రయాణానికి కేటాయించడం జరిగింది. 1350 ఎలక్ట్రిక్ బస్సులు బుక్ చేయడం జరిగిందని, అవి రాగానే మహిళలు ఏసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ పథకం ప్రభుత్వానికి ఎక్కడ భారం అని తాము భావించడం లేదని అన్నారు. ప్రస్తుతం 70 శాతం మహిళలు ఉచిత బస్సులు ప్రయాణిస్తున్నారని దానికి అనుగుణంగా స్టాప్ ని రిక్రూట్ చేసుకుంటామన్నారు.