– టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
పొన్నూరు: దేశం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ అన్నారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నరేంద్రకుమార్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే… 47 ఏళ్లుగా ప్రజా సేవలో తరిస్తోన్న ధన్యుడు.. దివంగత ఎన్టీఆర్ ఆశయ సాధనకు కంకణబద్దుడు.. తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దార్శనికుడు.. ప్రజల వద్దకే పాలనకు శ్రీకారం చుట్టిన ఆద్యుడు… యువతకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన ధీరోదాత్తుడు…
రాజకీయాన్ని రాష్ట్రహితం కోసం అన్వయించిన అపర చాణక్యుడు… సాంకేతిక విజ్ఞానాన్ని సామాన్యుని హితం కోసం వాడిన మేటి నాయకుడు… నవ్యాంధ్ర ప్రగతికి తొలిబాట వేసిన కార్యశూరుడు… రాష్ట్రానికి దిక్సూచి… తెలుగు ప్రజల భవిష్యత్తుకు మార్గదర్శి… మన చంద్రన్న!
దేశం గర్వించే నాయకుడు, పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు తొలి సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ మహా నాయకునికి శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు లాంటి దేశం గర్వించే నాయకుడి నాయకత్వంలో పని చేయడం మా అందరికీ గర్వ కారణం. అటు పార్టీ, ఇటు ప్రజలే జీవితంగా అనునిత్యం తపించే చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి!