తిట్లు, హేళనలు, పచ్చి అబద్ధాలను భరిస్తూ పనిలో నిమగ్నం అవ్వడం ఒక సగటు మనిషికి సాధ్యమా?
అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే మనం సగటు మనుషులం. కానీ, ఒక కర్మయోగికి అది సాధ్యమే. అన్ని రకాలుగా తిడుతున్నా, నవ్వుతున్నా, ఆయన కలలు మాత్రం ఆగలేదు. ఎదలో బాధను దాచుకొని, పెదాలపై చిరునవ్వుతో పనిలో నిమగ్నమయ్యే వ్యక్తి ఆయన. ముప్పై ఏళ్లుగా అదే అలవాటు, పని ఆయన వ్యసనం.
ఒక కర్మయోగి ప్రస్థానం
ఒకప్పుడు గుడిసెలో… కట్టెల పొయ్యి పొగలో ఊపిరి తీసుకుంటూ, కరెంటు పోతే ఎప్పుడు వస్తుందో తెలియని స్థితి. కష్టపడి వచ్చిన నిద్రపోకుండా ఆలోచించే యజమానిని గమనిస్తూ బాధపడే భార్య. ఊరికి దారి లేదు. తాగడానికి నీరు దొరకని పరిస్థితి. పిల్లలకు ఈ కష్టాలు ఉండకూడదని కన్నీళ్లు పెట్టుకున్న ఆ పల్లెల్లోని మనుషుల కోసం, ఒక కర్మయోగిగా 30 ఏళ్ల క్రితం ఆయన వచ్చారు.
లక్షల గుడిసెల స్థానంలో లక్షల ఇళ్లు ఒకేసారి కట్టించి గృహప్రవేశాలు చేయించాడు.
ఈ కాలంలో అరకోటి పెట్టినా దొరకని అపార్ట్మెంట్ లెక్కన, అంతకంటే మెరుగైన సౌకర్యాలతో లక్షలాది టిడ్కో ఇళ్ళు సామాన్యులకు, పేదలకు నిర్మించి ఆశ్చర్యపరిచాడు. కట్టెల పొయ్యి బదులు దీపం కింద గ్యాసులు ఇచ్చి పొగలు లేకుండా చేశాడు. వంటింట్లో ఉన్న మహిళలను డ్వాక్రా సంఘాల్లో చేర్చాడు. దేశంలో ఆ రెండూ ఉద్యమాలు అయ్యాయి.
ఆ పల్లెలకు దూరంగా ఉండే అధికారులను ప్రజల వద్దకే పాలన అంటూ తీసుకువెళ్లాడు. కార్యాలయాల్లో సిటిజన్ చార్ట్ పెట్టించాడు. శ్రమదానం, జన్మభూమి కింద పల్లెలకు రోడ్లు వేసుకున్నారు. అదే పల్లెల్లో సిమెంటు రోడ్లు వేయించి దేశాన్నే ఆశ్చర్యపరిచాడు. గ్రామ గ్రామానికి సురక్షిత ట్యాంకులు వచ్చాయి, అవి ఇప్పుడు ఆర్.ఓ. ప్లాంట్లుగా మారుతున్నాయి. పల్లెల్లో పిల్లలకు కూడా ఇంజినీరింగ్ విద్య లభించేలా చేశాడు.
సాంకేతిక దార్శనికత
ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టేలా ఇంకుడు గుంతలు అన్నాడు. కుప్పంలో ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ తెచ్చాడు. దేశంలో అదో ఉద్యమం అయ్యింది. తెలుగువారు తెలివైనవారని ప్రతి సందర్భంలో ప్రోత్సహిస్తూ.. హైటెక్ సిటీ, సైబరాబాద్‌లను నిర్మించాడు. బయోటెక్‌లో ప్రపంచానికే కరోనా సమయంలో వ్యాక్సిన్ దొరికే అడ్రస్‌గా జీనోమ్ వ్యాలీని చేసి, ప్రపంచాన్ని మనవైపు చూసేలా చేశాడు.
అన్నదాతల బిడ్డలను కోటీశ్వరులను చేసే టెక్నాలజీవైపు నడిపించిన మార్గదర్శి ఆయన. లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలు తెస్తున్నారు. ఆయన ఆలోచనలో పురుడు పోసుకున్న రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులు కియా నుండి గూగుల్ వరకు లక్షలాది ఎకరాల అన్నదాతలను భాగస్వామ్యులను చేసి కోటీశ్వరులను చేస్తున్నారు.
అలిసిపోకుండా మరో ప్రపంచ స్థాయి నగరానికి రూపకల్పన చేసి, పూలింగ్ విధానంతో అన్నదాతలను భాగస్వామ్యులను చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. దానిని భవిష్యత్‌లో టెక్, హెల్త్, గ్రీన్, ఎంటర్టైన్మెంట్, ట్రాఫిక్ సమస్యలు లేని నగరంగా… క్వాంటం ఆవిష్కరణలకు వ్యాలీగా.. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా తీర్చిదిద్దుతున్నాడు.
అంకితభావం: ఒక స్థితప్రజ్ఞుడి నిశ్చలత్వం
ఈయన భుజానికి ఎత్తుకున్న సంక్షేమం మా వల్ల కాదని ఇక్కడ, పొరుగు రాష్ట్రాల్లో కూడా చేతులెత్తేశారు. అయినా దేశంలోనే అత్యంత ఎక్కువ సంక్షేమం ఇస్తూ.. నదులను అనుసంధానం చేస్తూ యావత్తు రాష్ట్రానికీ త్రాగు, సాగు నీరు అనే సమస్యను శాశ్వతంగా రాకుండా చేయాలని కృషి చేస్తున్నారు. 4 వరసల దారులు, 6 వరసల రహదారులు, రింగు రోడ్లు, విమానాశ్రయాలు, పోర్టులు మనకు లేనిది ఏమిటి అనే పరిస్థితి తీసుకురావడానికి పరుగులెత్తిస్తున్నాడు.
ఎప్పటికప్పుడు ప్రపంచ గమనాన్ని దశాబ్దాలకు ముందే ఊహించి వేగంగా ప్రణాళికలు వేసి కష్టపడే క్రమంలో.. ఆయన కష్టం కళ్ల ముందు కనిపించే లోపు ఏమారి, ప్రజలు ఆయన్ను ప్రతిపక్ష నేతగా పంపడం, పడరాని కష్టాలు పడడం, తిరిగి నువ్వే దిక్కని ఆయన్ను ఎన్నుకోవడం మామూలే.
ఆయన అనుభవాన్ని, దార్శనికతను అర్థం చేసుకోవడంలో వెనకబడుతూ.. అభినందించాల్సింది పోయి, అర్థం కాకపోతే ఊరుకోక, తిడుతూ దూరం పెడుతున్నా.. ఆయన మారక, చిన్నబుచ్చుకోక, ఆంధ్రాను అగ్రగామి చేసే పనులలో నిమగ్నమయ్యాడు. అలా సగటు మనిషికి సాధ్యమా? స్థితప్రజ్ఞులు, కర్మయోగులకు మాత్రమే సాధ్యమవుతుంది.
ప్రతి సమస్యనూ అవకాశంగా చూసే ఆయన ముందు సంక్షోభాలు చిన్నబోయాయి. మూడు దశాబ్దాల అధికారంలో దేశాభివృద్ధి వేగపు అంకెలకంటే ఎక్కువగా సాధించి, దేశంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికారు. ఈ ప్రజారుషి చంద్రబాబు నాయుడి పనులు సూర్యచంద్రులు ఉన్నంతకాలం మనకు నగరాలుగా, రహదారిగా.. నీటి బొట్టుగా.. తినే ముద్ద రూపంలో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంటాయి.