– కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా లేను
– ప్రభుత్వ పనుల గురించి ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నా
– కోనప్పను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారు
– మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తాను గులాబీ పార్టీని వదిలిపెట్టినందుకు చాలా బాధగా ఉందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేయలేకపోతున్నానని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీని వీడినందుకు నాకు బాధగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ నేను క్రియాశీలకంగా లేను. ప్రభుత్వ పనుల గురించి ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు. కోనేరు కోనప్పను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు.