– వృద్ధులు, వికలాంగులకు ఉచిత రవాణా కోసం…
– పూజలు చేసి బ్యాటరీ వాహనాన్ని ప్రారంభించిన చిన్నారెడ్డి, దివ్య దేవరాజన్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి విజయవంతంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి ప్రజావాణికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా బ్యాటరీ వాహనాన్ని మంజూరు చేసింది.
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ జి చిన్నారెడ్డి, సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ బ్యాటరీ వాహనానికి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంగళవారం పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు.
సీఎం ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై ధరఖాస్తులు అందజేసేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగులకు ప్రధాన రహదారి మేన్ గేటు నుంచి పిటిషన్లు అందజేసే భవనం వరకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించి రూ. ఏడు లక్షల విలువ చేసే బ్యాటరీ వాహనాన్ని వినియోగించనున్నారు.