– కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో పచ్చబొట్టు
– కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ కార్యకర్త అర్జున్‌పాండే వీరాభిమానం
హైదరాబాద్: కుత్బుల్లాపూర్‌కు చెందిన అర్జున్ పాండే అనే వ్యక్తి తన ఛాతీపై మాజీ సీఎం కేసీఆర్ , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రాలను పచ్చబొట్టు వేసుకొని తన అభిమానాన్ని చాటుకున్నారు. అర్జున్ పాండే, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ని తన కార్యాలయంలో కలసి, ఆ పచ్చబొట్టును చూపిస్తూ కేసీఆర్ , కేటీఆర్ పై తన అపారమైన ప్రేమ, అభిమానాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా రాజు.. అర్జున్ పాండే అభిమానాన్ని మెచ్చుకుని, “కేసీఆర్ , కేటీఆర్ పై ప్రజల్లో ఉన్న గాఢమైన నమ్మకం, విశ్వాసానికి ఇది ప్రతీక” అని అన్నారు.