– ఎంపీ డీకే అరుణ
విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సేవా పక్షోత్సవాల రాష్ట్ర కార్యశాల శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, బీజేపీ ఆర్గనైజేషనల్ సెక్రటరీ మధుకర్ జీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న, ఆడారి ఆనంద్ కుమార్, మేకల హనుమంతు రావు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి, నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడారు.
ప్రతి ఒక్కరికీ గురువు మన జీవితాలను మలిచే దైవాలు.. సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి ఎంతో సేవ చేశారు.
విద్యా విధానంపై సమగ్ర ఆలోచన చేసిన విద్యావేత్త, బహుభాషా కోవిదులు. సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17 వరకు బీజేపీ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నరేంద్ర మోడీ ఆదర్శవంతమైన జీవితం తో కృషి, పట్టుదలతో ఎదిగారు. మోడీ ముఖ్యమంత్రి గా, ప్రధాన మంత్రి గా ఆయన చేసిన కార్యక్రమాలు స్ఫూర్తిగా నిలుస్తాయి. ప్రధాన మంత్రి మోడి అనేక నదులకు పునరుజ్జీవనం కలిగించారని పేర్కొన్నారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే..
స్వాతంత్య్రం కోసం పోరాటాలు, త్యాగాలు చేసిన వారిని కాంగ్రెస్ మరచిపోయింది. మోడీ కృషి తో విదేశాల్లో ఉన్న వారి చితా భస్మాన్ని తీసుకువచ్చి ఇక్కడ నదుల్లో కలిపారు. అత్యధిక పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం గా గుజరాత్ ను మోడీ అభివృద్ధి చేశారు. దేశ ప్రధానిగా… ప్రపంచ దేశాల్లో భారత్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ స్మారక స్థూపం నిర్మాణం చేశారు. ఎవరు ఎన్ని కుట్ర లు చేసినా, విమర్శలు చేసినా పట్టించుకోకుండా అనుకున్న లక్ష్యాలను సాధించారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
మోడి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి.
డీకే అరుణ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని ప్రపంచ దేశాలు ఆహ్వానం పలుకుతున్నాయి.
ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీని అనుసరిస్తున్నాయి. సేవ పక్షోత్సవాల కార్యక్రమం ప్రతి ఏడాది నిర్వహిస్తాం.
ఈసారి మోడీ 11 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్నారు. మోడీ పుట్టిన రోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. మోడీ నాయకత్వంలో స్పూర్తి గా నిలిచేలా ఈసారి కార్యక్రమాలు ఉంటాయి. సెప్టెంబరు 17 నుంచి దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అందరూ ప్రజలు వద్దకు వెళతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపేలా చర్యలు చేపడతారు. సెప్టెంబరు 17న ఏపీ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.
మోడి 75 వ పుట్టిన రోజు సందర్భంగా 75 కి తగ్గకుండా ప్రతి చోటా రక్తదానం చేసేలా ఏర్పాటు చేయాలి.
పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, గ్రామాల్లో రోడ్లు పరిశుభ్రంగా ఉండేలా చేయాలి. స్వచ్చత అభియాన్ అంటే ఫోటోలకు పోజుకు కాదు.. పనితీరుతో ప్రజల్లో మార్పు తేవాలి.. బూత్ స్థాయి నుంచే అందరినీ ఇందులో భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు.