– ఘనంగా పెద్ద మసీదులో మీలాద్ ఉన్ నబి వేడుకలు
– ప్రవక్త 1500 సంవత్సరం జన్మదిన సందర్భంగా పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ
– జులూస్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం జయప్రదం చేసిన, నందిగామ పట్టణ ఐదు మసీదుల ముతవల్లిలు
– ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఫారుక్ షిబ్లి
నందిగామ: మీలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా పట్టణంలోని పెద్ద మసీదు నందు ఘనంగా నిర్వహించారు. జలుసే మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం లో ర్యాలీ నందు సయ్యద్ సుల్తాన్ ఇబ్న్ హుస్సేన్ చిష్టి బాబా ఖాజా గరీబ్ నవాజ్ పీఠాధిపతి, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ ఫారుక్ షిబ్లి, కొండపల్లి దర్గా పీఠాధిపతి, రాష్ట్ర అహలెస్ సున్నత్ జమాత్ ప్రతినిధి కొండపల్లి అల్తాఫ్ బాబా, ప్రముఖ సౌత్ ఇండియా మత గురువు అల్తాఫ్ ఖాన్ ,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, నందిగామ పట్టణ ఐదు మసీదుల ముత్తవల్లీలు, ముస్లిం సంఘాల నాయకులు పాల్గొని ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
ఇళ్ళు, మసీదులు, ఇతర భవనాలపై, లోపల పండుగ బ్యానర్లు, బంటింగ్లు మసీదులు, ఇతర కమ్యూనిటీ భవనాలలో సామూహిక భోజనాలు మొహమ్మద్ జీవితం, పనులు మరియు బోధనల గురించి కథలు మరియు కవితలు ( నాట్స్ ) వినడానికి సమావేశాలు, సౌదీ అరేబియాలోని పవిత్ర నగరాలైన మక్కా మరియు మదీనాలోని మసీదుల ఫోటోలను ప్రదర్శించే ప్రదర్శనలు నిర్వహించారు.
ఆకుపచ్చ జెండాలు లేదా బ్యానర్లు లేదా ఆకుపచ్చ రిబ్బన్లు లేదా దుస్తులను ధరిస్తారు. ఆకుపచ్చ రంగు ఇస్లాం మరియు స్వర్గాన్ని సూచిస్తుంది. ముహమ్మద్ ప్రవక్త విశిష్టత అజ్ఞానంతో, అరకొర జ్ఞానంతో ఊగిసలాడుతున్న నేటి ఆధునిక తరానికి జ్ఞానకాంతులతో సన్మార్గం చూపిన యోధుడు ఈ లోకం వీడి దాదాపు 1500 ఏళ్లకు పైగా అవుతున్నా ఆ మహనీయుని బోధనలు ఇప్పటికీ మనవద్ద సురక్షితంగా ఉన్నాయంటే ఆ మహనీయుని విశిష్టత తెలుస్తుంది
ఆ మహనీయుడు చెప్పినవి నేటి తరం ఆచరించగలిగితే ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఓ సత్సమాజం ఆవిష్కృతమవుతుంది. నేటి ఆధునిక పరిస్థితుల నేపథ్యంలో ముహమ్మద్ ప్రవక్త బోధనలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మత గురువులు అన్నారు.ప్రవక్త జీవితానికి సంబంధించిన విశేషాలను వివరించారు. మత సామరస్యం, శాంతికి ప్రతీకగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పెద్ద మసీదులో విశ్వశాంతి కోసం ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం పెద్ద మసీదులో మరియు మదర్సా నందు భారీ అన్న వితరణ లంగర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద మసీదు ముత్తవల్లి మహమ్మద్ ఖాజా మొహిద్దీన్, చత్తీస్ గడ్ ధంతరి నుండి విచ్చేసిన గురువులు అల్తాఫ్ ఖాన్ రజ్వీ, ప్రభుత్వ ఖాజీ అహ్మద్ రజ్వి, ముస్లిం నాయకులు బుడేమియా, సీటీవో బాబు,ఎస్ ఎం,రబ్బానీ, మత గురువు సాదిక్ రజా, తోసిఫ్ రజా, బడేమియా, మున్నా, పాషా, సైదా , ఖాజా,కరీముల్లా, అల్లావుద్ధీన్, ముస్లిం సంఘాల నాయకులు, మైనార్టీ సంఘాల ప్రతినిధులు , వివిధ రాజకీయ, నందిగామ ఐదు మసీదులు పెద్దలు,జామాత్,తదితర పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.