– వ్యక్తిగతంగా వచ్చారా? పార్టీ తరపున వచ్చారా ?
– మిలాథ్ ఉన్ నభి కార్యక్రమంపై మీద మీకు అభిమానం ఉంటే మీ లబ్బీపేట లో చేసుకోండి
– ఫారూఖ్ షూబ్లీ పై మండి పడ్డ టీడీపీ మైనార్టీ నాయకులు
నందిగామ: పట్టణం లో ముస్లిం సోదరులు పవిత్ర మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను జస్నే -ఈద్- మీలాద్ ఉన్ -నభి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ నాయకులు ఇమామ్ జానీ మాట్లాడుతూ ముస్లిం సోదరులు సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇమామ్ జానీ తన కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడుతూ, పెద్ద మసీదులో వచ్చిన ఫారూక్ షూబ్లీ పై విరుచుకుపడ్డారు. షూబ్లి తెలుగుదేశం నాయకుడు చెప్పుకుంటూ నందిగామ వచ్చి రకరకాలుగా మతసామరస్యాల గురించి మాట్లాడారు. నందిగామలో మతసామరస్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని దాని గురించి ఎటువంటి కామెంట్ చేయాల్సిన అవసరం లేదన్నారు.
నందిగామ టౌన్ తెలుగుదేశం పార్టీ నుండి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను.. మీరు వ్యక్తిగతంగా వచ్చారా? పార్టీ తరపున వచ్చారా ? తెలుగుదేశం పార్టీ నుండి వచ్చేనట్లయితే ఇక్కడ నందిగామ తెలుగుదేశం పార్టీ వాళ్లకి తెలియాల్సిన అవసరం ఉంది. ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత ఉంది. మీరు బాధ్యతల్ని మరిచి ప్రవర్తించారని గుర్తు చేస్తున్నాను. మీరు ఏ పార్టీ నుండి వచ్చారో చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది అని పేర్కొన్నారు.
మీరు వచ్చినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయొద్దని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్లారు. అది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నందిగామ రాజకీయాల గురించి నీకు తెలియకపోతే తెలుసుకో మిస్టర్ షూబ్లీ!
మిలాథ్ ఉన్ నభి కార్యక్రమంపై మీద మీకు అంత అభిమానం ఉన్నట్లయితే మీ విజయవాడలో మీ లబ్బీపేట లో చేసుకోండి మీరు నందిగామ వచ్చేముందు తెలుగుదేశం పార్టీగా వచ్చినట్లయితే మా ప్రోటోకాల్ ని పాటించాల్సిందే మీరు వ్యక్తిగతంగా వస్తే మా పార్టీ నాయకుల పేర్లు వాడారు ఎందుకని హెచ్చరించారు. ఇకనుండి వచ్చేటప్పుడు నందిగామ పరిస్థితులు స్థితిగతులు తెలుసుకోవాల్సిన బాధ్యత నీపై ఉందని గుర్తు చేశారు.
ఈ విషయం హై కమాండ్ తెలియజేస్తామని, వ్యక్తిగతంగా వస్తే వ్యక్తిగతంగా ఉండాలని.. అనవసరమైన విషయాలు మాట్లాడి వెళ్తే పార్టీ నిర్ణయాలు వేరే విధంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇమామ్ జానీ, అసీం భాష, ఇమామ్ భాయ్ రబ్బాని, తదితరులు పాల్గొన్నారు.