– బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
విజయవాడ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో మనమంతా ముందుకు పోవాల్సి ఉంది. అడ్డూరి శ్రీరామ్ జిల్లా అధ్యక్షుడు గా పనిచేస్తున్నారు. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పర్వదినం. నెల్లూరు లో పుట్టి స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి ఆయన అని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని సితార ఎన్ కన్వెన్షన్ లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాధవ్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…
సర్వేపల్లి రాధాకృష్ణ ఉప రాష్ట్రపతి గా పనిచేసి రాష్ట్రపతి గా పనిచేసిన వ్యక్తి. ఈ సందర్భంగా గురువులు అందరికీ నమస్కారాలు. ముస్లిం లకు పర్వదినం మిలాదున్నబి పండుగ. మహమ్మద్ ప్రవక్త ఆశీస్సులు వారందరికీ ఉండాలి. బీజేపీ అన్ని మతాలకు ప్రాతినిధ్యం కల్పిస్తుంది. ఎవరికి నచ్చిన విధంగా వారు వారి భగవంతుని ఆరాధించాలి. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.
పింగళి వెంకయ్య పుట్టిన నెల మనది. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములుకి నివాళులు అర్పించాం. అనేక మంది ప్రముఖులు పుట్టినిల్లు మన బెజవాడ గడ్డ. మనకు ప్రాతినిధ్యం కల్పించాలి అంటే బీజేపీ నుండి నాయకులు శాసనసభలకు ప్రాతినిధ్యం కల్పించాలి. రాబోయే ఔటర్ రింగ్ రోడ్డు గేమ్ ఛేంజర్. అమరావతి నిర్మాణం అత్యంత వైభవంగా నిర్మాణం జరుగుతుంది. ఇన్ని అభివృద్ధి పనులు మోడీ సారథ్యంలో జరుగుతున్నాయి. 300 కోట్ల రూపాయలు ఖర్చు తో విజయవాడను ముంపు నుండి కాపాడాం. విజయవాడ తూర్పు నియోజకవర్గం కు చెందిన దొడ్డపనేని కల్యాన్ కృష్ణ (క్రికెట్ కామెంటేటర్), దొడ్డపనేని శ్రీకాంత్, బసవేశ్వరరావు మరికొంత మంది పార్టీ లో చేరారు.
అమెరికా బెదిరింపులకు పట్టించుకోకుండా మోడీ ముందుకు వెళ్తున్నారు. రష్యా, చైనా అధ్యక్షులు మోడీ కి ఎంతో గొప్పగా స్వాగతం పలికారు. నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు అమలు రూపంలో ప్రతి ఇంటికీ వచ్చారు. కోవిడ్ సమయంలోఉచితంగా బియ్యం ఇచ్చి ఆదుకున్నారు. సంక్షేమ పథకాలు డబ్బు డైరెక్ట్ గా మీ అకౌంట్ లలో పడే విధంగా వ్యవస్థను తీర్చిదిద్దారు.