– శాప్ ఛైర్మన్ రవినాయుడు
విజయవాడ: దక్షిణ కొరియాలోని గ్వాంగ్జు వేదికగా హ్యుందాయ్ అంతర్జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, రిషబ్ యాదవ్ కు అభినందనలు. సెమీ ఫైనల్లో చైనీస్ తైపీ టీమ్‌పై అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచి 157-155 పాయింట్ల తేడాతో ఫైనల్‌కు చేరుకున్న ఇద్దరికీ అభినందనలు అని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచులో కూడా తమ ప్రతిభను, ప్రదర్శనను కనబరిచి వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని, భారత కీర్తిప్రతిష్ఠతలను విస్తరింపజేస్తారని ఆశిస్తూ ఆయన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.