– మంత్రి జూపల్లి కృష్ణారావు
గద్వాల: కవిత ఓ కొరివి దెయ్యం. నేను మంత్రి పదవి ఆశించి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లలేదు. కానీ ఆ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా పాతరవేసింది. కవిత ఇప్పుడు కొన్ని విషయాలు దాచిపెడుతూ, మరికొన్ని మూసిపెడుతూ మాట్లాడుతున్నారు. పూర్తి నిజాలు బయటపెట్టడం లేద ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని స్వయంగా కవితే చెప్పిన విషయాన్ని జూపల్లి ప్రస్తావించారు. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయని కవితే అన్నారని గుర్తుచేస్తూ, ఆ దెయ్యాల్లో ఆమె కూడా ఒకరని ఆరోపించారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షతన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.