– వైఎస్ జగన్ విమర్శ
తాడేపల్లి: వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు వి. ఖాదర్ భాషా ఆధ్వర్యంలో ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది షేక్ నాగుల్ మీరా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ముస్లిం సమాజం వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచే వెన్నుదన్నుగా నిలిచిందని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ముస్లింలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని తీవ్రంగా విమర్శించారు. ఈ విషయాలను ప్రజా సంఘాలు ప్రజలలోకి తీసుకెళ్లి, నిజాలను వెలుగులోకి తేవాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు చేసిన సంక్షేమాన్ని కూడా ప్రజలకు గుర్తు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ, గతంలోనూ ప్రజా సంఘాలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేశాయని, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి మేము అహర్నిశలు శ్రమించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.