– ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్
తిరుపతి: జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ ప్రప్రథమంగా తిరుపతి జిల్లాలో ఈ నెల 14, 15 తేదీలలో జరగనున్న జరగనుండడం విశేషమని, అందరు గర్వించదగ్గేలా కలిసికట్టుగా నిర్వహిద్దామని ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ అన్నారు. జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరంలో కాన్ఫరెన్స్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి మహిళా ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారని తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుండి విచ్చేసే ప్రముఖులకు ఎలాంటి లోటుబాట్లు లేకుండా, అవాంతరాలు ఏర్పడకుండా మౌలిక వసతులను కల్పించాలని దానికి తగ్గట్లుగా లైజాన్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు 4 రోజుల పాటు విధులు కేటాయించిన ప్రతి అధికారి సమన్వయంతో లోటుపాట్లు లేకుండా వారికి కేటాయించిన విధులను నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ కార్యాలయపు సిబ్బంది, రెవెన్యూ డివిజన్ అధికారి రామ్ మోహన్, ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్ శివరాం నాయక్, జిల్లా అధికారులు, లైజనింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.