– కేటీఆర్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
హైదరాబాద్: ఇండ్ల కూలగొట్టుడు గురించే కేటీఆర్ మాట్లాడటం విడ్డూరం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ వేశారు. ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చిన్న శ్రీశైలం యాదవ్ ఇంటిని కేటీఆర్ కూలగొట్టియ్య లేదా..? పదేండ్లు పాలించి ఈ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు అన్నా కట్టించారా..? ఎన్నికలు, ఉప ఎన్నికలంటే బీరు బిర్యాణి కల్చర్ తెచ్చింది కేటీఆర్.
హుజురాబాద్, దుబ్బాక, మునుగోడులో కోట్ల డబ్బులు, లిక్కర్ సిసాలు పంచిది టీఆర్ఎస్. పద్దెనిమిదేళ్లు నిండితే చాలు..ఎన్నికల్లో నిర్బంధ మధ్యం విదానాన్ని అమలు చేసింది విల్లే. జుబ్లిహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే లాభం లేదు. ప్రభుత్వం మారదు. కాంగ్రెస్ ను ఆశీర్వదిస్తే ఇక్కడ అభివృద్ది జాతర ఉంటుందన్నారు. ఎన్నికలొస్తేనే కేటీఆర్ వస్తాడు. కాని మీకు ఏ అవసరం వచ్చినా మేం అందుబాటు లో ఉన్నాం. కూట్లో రాయిని తీయని వాడు, ఏట్లో రాయిని తీస్తాడా..? సొంత చెల్లికి న్యాయం చేయలేనోడు జూబ్లిహిల్స్ కు ఏమి చేస్తాడు? గోపినాథ్ మీద ప్రేమ ఉంటే మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు..? అని ప్రభాకర్ ప్రశ్నించారు