– ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని పిలుపు
– జాగృతి కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన చింతమడక గ్రామస్తులు
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తో ఆమె తండ్రి కేసీఆర్ సొంత ఊరు చింతమడక గ్రామస్తుల భేటీ
– ఈనెల 21న ఎంగిలి పూల బతుకమ్మ పండుగకు రావాలని ఆహ్వానం
హైదరాబాద్ : గొప్ప ఉద్యమకారుడిని కన్న గొప్ప ఊరు మా చింతమడక.. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి నన్ను బతుకమ్మకు ఇన్వైట్ చేయటం సంతోషంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తాను చింతమడక నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు.. తన చిన్నప్పుడు చింతమడక లో బతుకమ్మ ఆడిన రోజులు ఇంకా కండ్ల ముందే ఉన్నాయని గుర్తు చేసుకున్నారు.. ఈ సమయంలో మీరంతా వచ్చి తనకు ఇచ్చింది మామాలు ధైర్యం కాదన్నారు