– సభ్యత, సంస్కారం తెలియని వ్యక్తి జగన్
– వెళ్లి బావిలో దూకమనడం, పిల్లి శాపనార్థాలు పెట్టడం జగన్ కు శోభనివ్వవు
– జగన్ పొలిటికల్ లీడరో, స్ట్రీట్ ఫైటరో అర్థం కావడంలేదు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శ
మంగళగిరి: సభ్యతా, సంస్కారంలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…
ఘోరంగా ఓడిపోయిన జగన్ నిరాశ, నిస్ప్రహలతో కొట్టుమిట్టాడుతున్నారు. సంస్కారం లేకుండా జుగుప్సాకర భాష మాట్లాడుతున్నారు. . నిన్న జరిగిన పాత్రికేయ సమావేశంలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, అచ్చెన్నాయుడులను బావిలో దూకి చావండని మాట్లాడటం జగన్ నిరాశ, నిస్పృహలకు పరాకాష్ఠ. తల్లిని, చెల్లిని గౌరవించని వ్యక్తి ఎదుటివారిని గౌరవిస్తారని అనుకోవడం కలే అవుతుంది. కూటమి ప్రభుత్వంలో హామీల అమలు శరవేగంగా జరుగుతున్నాయి, జగన్ ఐదేళ్ల పాలనలో ఆయన హామీల అమలు, కూటమి ప్రభుత్వపు హామీల అమలుపై ఓపెన్ డిబేట్ కి మేం సిద్ధం.. జగన్ సిద్ధమా?
జగన్ రాష్ట్రానికి అయిదేళ్ళు ముఖ్యమంత్రి గా పనిచేసినా రాష్ట్రాభివృద్ధి దేవుడెరుగు. రాష్ట్రం ఇంకా వెనక్కి పోయింది. జగన్ అవివేకి. నేడు విపక్ష నేతగా ఉన్నా రాష్ట్రానికి ఉపయోగం లేదు. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చాలాకాలం రాజకీయాల్లో పనిచేశారు. జగన్ తమది సుదీర్ఘకాలం నుంచి రాజకీయ కుటుంబమని చెప్పుకుంటుంటారు. అయితే, ఆయనకు రాజకీయ లక్షణాలు లేవు. ఆయన వ్యవహారశైలి అందుకు భిన్నంగా ఉంది. ఆయన భాష జుగుప్సాకరంగా ఉంటోంది, ఆయన సంస్కార హీనుడు. ఆయన మాట సభ్యత శూన్యం.
జగన్ సభ్యత, సంస్కారాలు లేని వ్యక్తి. ఇలాంటి వ్యక్తి రాజకీయ నాయకుడెలా అవుతాడు? తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను గౌరవించడం, ఆదరించడం అతనికి తెలియదు. ప్రతిపక్ష నాయకులను గౌరవించడం తెలియదు. పెద్దవారిని ఆదరించడం తెలియదు. జగన్ వాక్కులు సభ్యత, సంస్కార హీనం. జగన్ ను పెంచడంలో రాజశేఖర్ రెడ్డి, విజయమ్మలు విఫలమయ్యారు. తండ్రితో సమాన వయసు వున్న చంద్రబాబును వెళ్లి బావిలో దూకమనడం బుద్ధి ఉన్నవాడెవరూ అలా అనడు. ఇంగిత జ్ఞానం ఉన్నవాడెవరూ అలా అనరు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, పవన్ కల్యాణ్ లను వెళ్లి బాయిలో దూకమంటాడా? శాపనార్థాలు పెట్టడమేమిటి? పూర్వం మహిళలు నీటి కోసం బావుల వద్దకు వెళ్లి మాట్లాడుకునే భాష అది. ఆధారాలుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.
చంద్రబాబుకు ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఏమీ కాదు. ఎన్నిసార్లు బావిలో దూకమన్నా జగన్ మాత్రం సీఎం కాలేడు. ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడితే భవిష్యత్తులో ఏనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు. ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు గౌరవించరు. ఛీకొడతారు. అగౌరవంగా మాట్లాడేవారికి ఎవరూ ఓటేయరు. గౌరవంగా మాట్లాడాలి, సంస్కారయుతంగా ఉండాలి అప్పుడే ప్రజలు ఓట్లేస్తారు. రాజకీయ నాయకులు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపినట్లుండాలి.
జగన్ తనది క్రైస్తవ మతమని, తాను బైబిల్ చదువుతానని చెప్పుకుంటుంటారు. క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా జగన్ వ్యవహరిస్తున్నాడు. బైబిల్ లో ఇలా బావిలో దూకమని చెప్పమని రాసి ఉంటుందా? ఎదుటివాడు ఒకటి తిడితే తాను పది తిడతాననేలా జగన్ వ్యవహారశైలి ఉంది. 2017 ఆగస్టు 4 వ తేదిన నంద్యాల ఉప ఎన్నిక జరుగుతుండగా చంద్రబాబును నడి రోడ్డుపై కాల్చిపడేయండన్నారు. జగన్ పొలిటికల్ లీడరో, స్ర్టీట్ ఫైటరో అర్థం కావడంలేదు. స్ట్రీట్ ఫైటర్ కే ఇలాంటి మాటలొస్తాయి. చంద్రబాబు సుదీర్ఘ కాలం రాజకీయ జీవితం గడిపే వ్యక్తి. ఏ మచ్చ లేకుండా రాజకీయం చేస్తున్న వ్యక్తిని కాల్చిపడేయండనడం ఏమైనా బాగుందా? జగన్ కు బుద్ది, జ్ఞానం, ఆలోచన అనేవి లేవు. ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడడు.
చంద్రబాబుని చెప్పుతో కొట్టాలని కూడా అన్నారు. జగన్ తండ్రిని కూడా అలాగే అని ఉండవచ్చు. అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు జగన్ ని తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు హైదరాబాద్ రావొద్దన్నారు. జగన్ గత చరిత్ర గురించి జనం తెలుసుకోవాలి. జగన్ కు కావలసినంత డబ్బిస్తా.. నీ జల్సాలు బెంగళూరులో చేసుకోమని తండ్రి కొడుకుతో అనడం వాస్తవం కాదా? జగన్ నేరప్రవత్తి తెలిసే వైఎస్ ఆర్ జగన్ ని హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వలేదు. జగన్ వ్యవహారశైలి చట్ట వ్యతిరేకంగా, సంఘ వ్యతిరేకంగా ఉంటుందని తెలిసే రాజశేఖర్ రెడ్డి జగన్ ను దూరంగా ఉంచారు.
నడిరోడ్డుపై ఉరితీయాలి అనడం తప్పు. పెద్దవారిని గౌరవించు, సభ్యతా, సంస్కారాలతో మాట్లాడాలని జగన్ తల్లిదండ్రులు నేర్పలేదా? జగన్ తనకు ముఖ్యమంత్రి పీఠం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వైసీపీ ఒక అసాంఘిక శక్తుల పార్టీ. రాష్ట్ర ప్రజలు జగన్ సంగతి తెలిసి 11 సీట్లకు పరిమితం చేసినా జగన్ లో మార్పు రాలేదు. జగన్ తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుతున్నాడు. అంబటి రాంబాబు, రోజా, జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి లాంటివారు సీఎం పదవి ఇవ్వరు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వాలి. జగన్ ను మెచ్చి, నచ్చితే ఇస్తారు తప్ప బావిలో పడేస్తా, తుపాకితో కాల్చేస్తా, చీపుర్లతో కొడతా, బంగాళాఖాతంలో కలుపుతా, నడిరోడ్డుమీద ఉరి తీస్తా అంటే సీఎం పదవి ఇవ్వరు.
కూటమి పార్టీలు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని నిరూపించగలరా? ఓపెన్ డిబేట్ కు రాగలరా? జగన్ తనకు సభ్యత, సంస్కారాలు నేర్పండని ఏదైనా రిటైర్డ్ టీచర్ ని పెట్టుకోవాలని సూచిస్తున్నాను. చంద్రబాబును బావిలో దూకమని లాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దని హెచ్చరిస్తున్నారు