– కలియుగపు అఘాయిత్యాలు ఇంకా ఉన్నాయి
– రికార్డుల్లో ఒక పార్టీ సభ్యుడిగా ఉండి మరో పార్టీ కేబినెట్లో మంత్రిగా ఉండటం అంత అన్యాయం
నిజమే . రాకపోతే ఎలా !? లక్షల్లక్షలు జీతభత్యాలు , జీవితాంతం పెన్షన్ , ఇతర సౌకర్యాలు , వగైరా . చట్టసభలకు రాకపోతే ఎలా ! అయ్యన్నపాత్రుడు గారి ఆవేదన , ఏబీఎన్ చానల్లో రఘురామకృష్ణం రాజు & వెంకటకృష్ణ ఆవేదన అర్ధవంతం అయినదే .
ఇప్పుడు అయ్యన్నపాత్రుడు గారు అవేదిస్తున్నట్లు కనీసం ఓ మూడు దశాబ్దాల నుండి స్పీకర్లు అవేదించి ఉంటే ఇప్పటికల్లో సెట్టయి ఉండేది . గతంలో నాకు గుర్తుండి యన్టీఆర్ , జయలలిత , కరుణానిధి , జగన్మోహన్ రెడ్డి , చంద్రబాబు , కెసిఆర్ అసెంబ్లీకి రాలేదు .
అయ్యన్నపాత్రుడు గారు అవేదించవలసిన అఘాయిత్యాలు ఇంకా ఉన్నాయి . చట్టసభల్లో నిద్ర పోవటాలు , బూతు బొమ్మల్ని చూడటాలు , అయిదేళ్ళలో ఒక్కసారి కూడా గళమెత్తకపోవటాలు , ఇలా చాలా అఘాయిత్యాలు ఉన్నాయి .
వీటి గురించి కూడా ఆవేదించి ఉంటే బాగుండేదేమో !
వీటన్నింటి కన్నా.. కలియుగపు అఘాయిత్యాలు ఇంకా ఉన్నాయి . అసెంబ్లీ రికార్డుల్లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గా ఉంటూ కేబినెట్లో మంత్రిగా ఉండటం !!! అలా ఉండటాన్ని స్పీకర్లు అంగీకరించటం !! అన్నన్నన్నా ఎంత అన్యాయం? వీటి గురించి కూడా ఆవేదించి ఉంటే బాగుండేది .
విడాకులు తీసుకోకుండా భర్త ఇంట్లో ఉంటూ మరో పురుషుడితో సంసారం చేయటం ఎంత అన్యాయమో.. రికార్డుల్లో ఒక పార్టీ సభ్యుడిగా ఉండి మరో పార్టీ కేబినెట్లో మంత్రిగా ఉండటం అంత అన్యాయం . ఆ గోల ముగ్గురికే సంబంధించింది . చట్టసభల్లో దురాగతం కోట్లమందికి సంబంధించింది . వీటి గురించి కూడా అయ్యన్నపాత్రుడు గారు అవేదించి ఉంటే బాగుండేది . అప్పుడప్పుడు అయినా రఘురామకృష్ణంరాజు గారు & వెంకటకృష్ణ వీటి మీద కూడా చర్చిస్తే బాగుంటుంది . ప్రజాస్వామ్యం బహు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది .
– ప్రొఫెసర్ డి. ఏ.ఆర్.సుబ్రమణ్యం