– ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్
విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రక్త దాన శిబిరం ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలో ఒక శక్తి వంతమైన నేత ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ ని వారి దేశాలకు ఆహ్వానించడానికి పోటీ పడుతున్నారు. అటువంటి నేత జన్మదినోత్సవం సందర్భంగా రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా మెడికల్ క్యాంపులు, పరిసరాల పరిశుభ్రత వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మాధవ్ వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్, బీజేపీ స్టేట్ ఆఫీస్ ఇన్చార్జి ఉప్పలపాటి శ్రీ నివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు.