నేపాల్ లో అగ్నిజ్వాలలు ఉవ్వెత్తుగా లేచాయి. నేపాల్ మొత్తం అగ్నికి ఆహుతిఅవుతోంది . తమ తోకలకి తామే నిప్పుపెట్టు కునే ‘అవివేక శునకాల వలె 13 ఏళ్ళ నుండి పాతికేళ్ళ పిల్లలు ఈ మారణ హోమానికి ఆద్యులు ‘ వీళ్ళలో ‘విచక్షణ విజ్ఞత ని చిదిమేసి, కృూరత్వం- అవివేకం నింపి దేశం మీదకి వదిలేసిన కనిపించని హస్తం.
ఆ హస్తం ని ఆడిస్తున్న వ్యక్తులు ఎవరో అందరికీ తెలుసు తెలియనిది ఆ అజ్ఞానులైన యువతకే . ఈనాడు మంటలలో కాలిపోతున్న తన దేశం ని తన భూమిని తిరిగి వాసయోగ్యం చేసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు శ్రమించాలి? ఎంత డబ్బు అవసరం ? అంతవరకూ అక్కడ ప్రజల కు నిలువనీడ ఉండదు. జనం బికారులు గా మారి పోతారు.
పిల్లలకు చదువు ఉండదు. చదువు సంగతి అలా వుంచి తినటానికి తి౦డి లభిస్తుందా. దేశాన్ని తగలేయటం అంటే తన ఇంటికి తాను స్వయంగా నిప్పుపెట్టుకున్నట్లే..
మొన్న బంగ్లాదేశ్, అంతకు ముందు శ్రీలంక లో ఇదే పరిస్థితి ఏమి తేడా లేదు . యువత రెచ్చిపోయి రాక్షసాకృతి దాల్చింది. తమ వేలితో తమ కన్ను పొడుచుకు౦ది.
శ్రీలంకలో ప్రభుత్వ పతనం తర్వాత రోడ్లు మీద టీస్టాల్ లో ఒక్క కప్పు టీ 3000 రూ. అమ్మింది. అంటే చూడండి ధరలు ఎలా పెరిగి పోయాయో. భారతదేశమే శ్రీలంక దీనావస్థ చూడలేక మిలియన్ల కొద్ది ఆర్ధిక సాయం, వస్తుసాయం అందించింది.
ఇక పాకిస్తాన్ ఆర్మీ, కాస్త ప్రజాస్వామ్య విలువలను పాటిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పడేసి, ఆర్మగౌరవం తో సహా అమెరికా కాళ్ళ మీద పడింది. అయినా అది పేదరికపు దిగువున దిగులుతో దిక్కులు చూస్తూనే వుంది.
అసలే నేపాల్ పేదదేశం. ఇక ఈ మారణ హోమం తర్వాత ప్రజల పరిస్థితి ఎంతకు దిగజారుతుందో అందరికీ తెలుసు ఒక్క రోజు లో చెలరేగే అగ్నికీలలు, 20 ఏళ్ళ ఇంఫ్రాస్ట్రక్చర్ ని దెబ్బతీస్తాయి. తిరిగి నిర్మించు కోవటం అంటే బడుగు దేశాలకు తలకు మించిన భారం కాదా?
ఆ భారం అంతా ఇప్పుడు నిప్పుపెట్టి రాక్షసానందం పొందే ఈ యువత భుజాల మీద మోయాలి ఈ బూడిద కుప్పల మీదే వీరి పిల్లల భవిష్యత్తు నిర్మించాలి. ఈ యువత, ఎంత బుద్ధిలేని పశువులో , జ్ఞానం లేని మూర్జులో కాని వారి సమాధులను వారే నిర్మించు కున్నారు.
పర్వత సానవులలో ‘ప్రశాంతంగా జీవించే నేపాల్ యువతలో ఈ కాలకూట విషం ఎవరు ఎక్కించారో , ఎందుకు ఎక్కించారో అది నేను రాయదల్చు కోలేదు. అందరికీ తెలిసిన విషయమే .
యువత వెర్రెత్తినట్లు పిచ్చివాడి చేతికి రాళ్ళు అందినట్లు భయంకరా కృతి దాల్చటమే గుబులు పుట్టిస్తోంది. ఒక ఉదాహరణ నేపాల్ మాజీ ప్రధానమంత్రి సతీమణిని ఆమె స్వనృహంలో నే కాల్చి బూడిద చేశారు. అంటే ఆ పైశాచికత్వం, వున్నాదం తారా స్థాయికి చేరింది.
ఎవడో వచ్చి నీ ఇంటిని కూల్చేయి అంటే పలుగు పార పట్టుకుని రెడీ అవుతారా? ఆలోచించరా ? నా ఇల్లు ….నేను ఏళ్ళ తరబడి ఎంతో శ్రమించి కట్టుకున్న ఇంటిని కూల్చేయాలా, అని ఒక్క క్షణం ఆలోచించే జ్ఞానం వుండదా? అక్కడి యువత లో ఆ మాత్రం విచక్షణా జ్ఞానం లేకపోయిందా?
ఇదంతా రాయడం లో ముఖ్య ఉద్దేశం మన చుట్టూవున్న అన్ని దేశాలు నాశనం అయ్యాయి. ఇక భారత్ వంతు మిగిలివుంది.. అంటే ఎంత ప్రమాదం అంచున వున్నామో గ్రహించండి. మన వెనకాలే ఒక కుట్ర జరుగు తోంది. అయినా దానిని తిప్పికొట్టే చేవ, విజ్ఞత మనందరిలో పుష్కలంగా ఉంది. మనం చేయాల్సింది మన పిల్లలను ఆలోచనాపరులను చేయటమే.
పెద్దలు తమ పిల్లలలో కొంచం తిరుగుబాటు లక్షణాలు కనిపించినా , ఏ మాత్రం అలసత్వం వద్దు. యోగ ధ్యానం తో సరిదిద్దండి. సహనం, సౌమ్యత పెంచండి,.. వారి స్నేహాలు, వారి సోషల్ మీడియా పోకడలను గమనిస్తు ఉండాలి.
వారితో మనసిచ్చి మాట్లాడుతూ వుంటే పిల్లల రూట్ ఏ వైపు వుందో అర్ధమైపోతంది. రాడికల్స్ ని కట్టడి చేయండి. పిల్లలకి బేసిక్ నీడ్స్ , రోడ్స్, కరెంట్ , వాటర్ ఎలా వస్తున్నాయో నిత్యావసర వస్తువులు ఎలా లభ్యమౌతున్నాయో, వాటిని ఇన్ని కోట్ల జనాభాకి గవర్మెంట్ ఎలా అందిస్తోందో ,డబ్బు ని పన్నుల రూపం లో ఎలా సమకూరుస్తున్నారో బోధించండి.. తలితండలు , టీచర్స్, లెక్చరర్స్ అందరూ ఈ బాధ్యత తీసుకోవాలి తప్పదు.
మన పిల్లలను, మన ఇంటిని. దేశాన్ని ఇంఫ్రాస్ట్రక్చర్ నీ కాపాడుకునే భాధ్యత ప్రతి పౌరుని ది అని మరిచిపోవద్దు..
ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే దేశం అంటే ప్రజలే . యువశక్తి ఒక మహా ప్రవాహం లాంటివి. పటిష్టమైన ఆనకట్టలు వుంటే ఆ జల ప్రవాహం దేశాన్ని సస్యశ్యామలం చేస్తుంది. ఆ అడ్డుకట్టలే లేకపోతే సర్వం గంగార్పణం. వూహించ లేని భీభత్సం.
మన యువత కి కూడా భూత దయ, విజ్ఞత, విచక్షణ, యోగా , ధ్యానం , క్రమశిక్షణ అనే ఆనకట్టలు వుండి తీరాలి. వారికి అలవాటు చేయాలి. అప్పుడే వారి జీవితం ఆనంద దాయకం.. మన దేశం సుభిక్షం.
జైహింద్
– అరుణ మల్లాప్రగడ
సేకరణ