– నీ దందా నువ్లు చేసుకో
– జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసు విచారణ తర్వాత మీడియాతో బీఆర్ఎస్ నేత గాదరి కిశోర్
– ఎంపీ సీఎం సీఎం రమేష్ పై అనుచిత వాఖ్యలు చేసిన కేసులో విచారణ కు హాజరైన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్
– 30 నిమిషాల పాటు విచారించిన పోలీసులు
హైదరాబాద్: మా నాయకుడు కేటీఆర్ పై వాఖ్యలు చేస్తే వాటికి ఖండిస్తూ మాట్లాడాను. నాపై కుట్ర పూరితంగా కేసు నమోదు చేశారు. నేను అనని వాఖ్యలను చిత్రీకరించారు. సీఎం రమేష్ టీడీపీ ఎంపీ నా, బిజెపి ఎంపీ నా అర్ధం కావడం లేదంటూ వారి ఎంపీ నే మాట్లాడుతున్నారు. తాటాకు చెప్పుళ్లకు భయపడము. పార్టీ కోసం ప్రజలకోసం పనిచేస్తాం. సీఎం రమేష్.. నీకు రాజకీయాలు ఎందుకు? నీ దందా నీవు చేసుకో. కేటీఆర్ పై సీఎం రమేష్ వ్యక్తిగత దూషణలు చేశారు. చట్టాలను గౌరవించి ఈ రోజు విచారణకు హాజరయ్యాను. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను.