– ప్రిలిమ్స్ , మెయిన్స్ అంటే తెలియని పాడి కౌషిక్ రెడ్డి
– ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
హైదరాబాద్: గ్రూప్ 1 పరీక్షల్లో గత పదేళ్లలో ఎన్నో అవకతవకలు జరిగాయి. మా ప్రభుత్వం అన్ని తప్పులను సరిదిద్ది గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాం. గ్రూప్ 1 పరీక్ష నిర్వహించకుండా మొదటి నుంచి బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న భయంతో విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు…
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్ తో పాటు కనీస అవగహన లేని పాడి కౌషిక్ రెడ్డి గ్రూప్ 1 పైన ఇష్టానుసారంగా మాట్లాడారు. గతం లో గ్రూప్ 1 పేపర్ల లీకేజీ విషయంలో కేటీఆర్ పీఎ పైన కూడా ఆరోపణలు వచ్చాయి…దీనిపైన కేటీఆర్ ఏనాడు స్పందించలేదు.. అంగట్లో సరుకులు అమ్మినట్లుగా గ్రూప్స్ పేపర్స్ లీక్ అయ్యాయి… అరెస్టులు కూడా జరిగాయి..
గ్రూప్ పరీక్ష ల నిర్వహణలో వైఫల్యంపైన ఏనాడు కేసీఆర్ ప్రభుత్వం కనీసం క్షమాపణ చెప్పలేదు. మా ముఖ్యమంత్రి టీజీపీఎస్సీ ని ప్రక్షాళన చేశారు.యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో మా సీఎం ప్రయత్నం చేశారు. గ్రూప్ 1 అభ్యర్థుల పరిస్థితిని పట్టించుకోకుండా అచ్చోసిన ఆంబోతులా కేటీఆర్ నోటీకొచ్చినట్లు మాట్లాడాడు.
పేపర్లు అమ్ముకున్నారని నోటీకొచ్చినట్లు మాట్లాడారు. ప్రిలిమ్స్ , మెయిన్స్ అంటే తెలియని పాడి కౌషిక్ రెడ్డి మాట్లాడాడు. ఐపిఎస్ అధికారిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అనవసర ఆరోపణలు చేశారు. మూడు కోట్ల ఇచ్చి ఉద్యోగం కొనుక్కున్నారన్న ఆరోపణల పైన సమాధానం చెప్పాలి. .
గ్రూప్ 1 అభ్యర్థుల తల్లిదండ్రులు, కుటుంబాల ఆవేదనకు సమాధానం చెప్పాలి. నియామకాలు జరగకుండా కాళ్లలో కట్టే పెట్టే ప్రయత్నం చేస్తే నష్టపోయేది నిరుద్యోగులే అన్న విషయాన్ని మరిచిపోవద్దు. నిరుద్యోగులపైన రాజకీయం చేయోద్దు.గ్రూప్ 1 కి ఎంపికైన వారందరికి అభినందనలు.
తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి గ్రూప్ 1 కి ఎంపికైనవారు భాగస్వాములు కావాలి. ఖాళీలను తప్పకుండా మా ప్రభుత్వం భర్తీ చేస్తుంది.. విద్యార్థులను రెచ్చగొట్టి దీక్షలు చేయిస్తే ఉపయోగం ఉండద్దు..బీఆర్ఎస్ సోషల్ మీడియాలో విష ప్రచారం చేయిస్తున్నారు.. ఈ విష ప్రచారంలో నిరుద్యోగులు భాగం కావొద్దు. నిరుద్యోగులు నోటిఫికేసన్ల కు సిద్ధంగా ఉండాలి.